అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు.. 10 మంది మృతి
Published on Wed, 08/05/2026 - 05:47
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ పరస్పరం జరుపుకున్న దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు చనిపోగా 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా, సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని మరో వైల్డ్‌బెర్రీస్ గోదాముపై దాడి చేయగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.
ఉక్రెయిన్‌లోని మైకోలైవ్, పివ్‌డెన్యి, ఒడెసా పోర్టులపై దాడి చేసి చమురు, ఆయుధాలు, సైనిక సామగ్రితో వెళ్తున్న నాలుగు నౌకలను ధ్వంసం చేశామంది. రష్యా దాడుల్లో మైకోలైవ్ ఒకరు, సుమీలో ఇద్దరు బాలికలు, ఒక వృద్ధురాలు, ఖర్కీవ్‌లో మరొకరు చనిపోయారు. అదేవిధంగా, క్రమటోర్స్క్లో రష్యా జరిపిన గ్లైడ్ బాంబుల దాడిలో మరో 22 మంది గాయపడ్డారు.
#
Tags : 1