Breaking News

Russia-Ukraine war: మరింత జోక్యంతో అణు యుద్ధమే

Published on Fri, 03/01/2024 - 06:11

మాస్కో: ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్‌ విజయం ఇప్పటికే ఖరారైంది.

ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్‌ విజయం యూరప్‌లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్‌లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్‌ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు.

మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం.

యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్‌ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది.

వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్‌ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్‌నిక్‌ అణు క్రూయిజ్‌ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్‌ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్‌ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)