Breaking News

యుద్ధ ఖైదీల మార్పిడి 

Published on Sat, 05/17/2025 - 04:28

ఇస్తాంబుల్‌: సర్వత్రా ఆసక్తి రేపిన రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ విరమణ చర్చలు ఆశాజనకంగా మొదలయ్యాయి. వెయ్యి మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. రష్యా ప్రతినిధి వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ ఈ మేరకు వెల్లడించారు. వాటిమధ్య దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద ఖైదీల మార్పిడి కానుంది. 

రష్యా, ఉక్రెయిన్‌ ప్రతినిధులు శుక్రవారం ఇస్తాంబుల్‌లో సమావేశమై తమ తమ డిమాండ్లు వినిపించారు. 2022లో యుద్ధం మొదలయ్యాక వాటి మధ్య ఇది తొలి ముఖాముఖి కావడం విశేషం. ఉక్రెయిన్‌ ప్రతినిధి వర్గానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్‌ సహాయకుడు మెడిన్‌స్కీ సారథ్యం వహించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకన్‌ ఫిదాన్‌ చర్చలను ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇరు పక్షాలను కోరారు. తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ముఖ్యమన్నారు.

 ‘‘కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాం. పుతిన్, జెలెన్‌స్కీ భేటీ ఏర్పాటు చేయాలన్న ఉక్రెయిన్‌ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పాం. చర్చలను కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉంది’’ అని మెడిన్‌స్కీ వెల్లడించారు. కీలకాంశాలను పరిష్కరించుకుని, చర్చల్లో పురోగతి సాధించాలని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్టు ఉక్రెయిన్‌ అధికారి ఒకరు తెలిపారు. అయితే రష్యా ముందెన్నడూ ప్రస్తావించని డిమాండ్లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవాలంటే ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌ సైన్యాలను ఉపసంహరించాలన్నది అందులో ఉన్నట్టు చెప్పారు. రెండు గంటల్లోపే చర్చలు ముగిసినట్టు తుర్కియే పేర్కొంది.

పుతిన్‌కు ఆసక్తి లేదు: జెలెన్‌స్కీ
చర్చల పురోగతిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పెదవి విరిచారు. కాల్పుల విరమణకు కూడా అంగీకారం కుదరలేదంటే దౌత్య మార్గంపై పుతిన్‌కు విశ్వాసం లేదని అర్థమన్నారు. అల్బేనియా రాజధాని టిరానాలో 47 యూరప్‌ దేశాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. చర్చల్లో రష్యా ప్రతిపాదనలు అంగీకారయోగ్యంగా లేవని బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ పేర్కొన్నారు. ‘‘చర్చలపై  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్‌స్కీ ఫోన్‌లో చర్చించారు. ఈ విషయంలో మేమంతా సహకారంతో సాగుతాం. సమష్టి బాధ్యత వహిస్తాం. ట్రంప్‌తో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్‌ కూడా ఆమోదించాయి’’ అని వెల్లడించారు.

త్వరలో పుతిన్‌తో భేటీ: ట్రంప్‌
రష్యా ఉక్రెయిన్‌ చర్చలపై ట్రంప్‌ స్పందించారు. పుతిన్‌తో తాను అతి త్వరలో భేటీ అయ్యే అవకాశముందన్నారు. ‘‘మా భేటీతో యుద్ధం ముగియవచ్చు, ముగియకపోవచ్చు. అయితే యుద్ధం కొనసాగితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంటూ గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్‌ చర్చలకు తాను వెళ్లని కారణంగానే పుతిన్‌ కూడా హాజరవలేదని ట్రంప్‌ గురువారం పేర్కొనడం తెల్సిందే. తన కుమార్తె టిఫానీకి కొడుకు పుట్టిన కారణంగానే ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘అందమైన నా మనవడిని చూడాలనుంది’ అని పేర్కొన్నారు. పుతిన్, ట్రంప్‌ భేటీకి వేళైందని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ కూడా అన్నారు. వారి శిఖరాగ్రానికి ఏర్పాట్లకు సమయం పడుతుందని చెప్పారు. 
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)