Breaking News

రష్యాలో ఘోర రైలు ప్రమాదం... 70 మందికి తీవ్రగాయాలు

Published on Thu, 06/27/2024 - 06:47

రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ  ప్రమాదంలో 70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రష్యా మీడియా కథనాల ప్రకారం గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.

​ఈ ప్యాసింజర్ రైలు ఈశాన్య కోమిలోని వోర్కుటా నుండి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం ఐదు వేల కిలోమీటర్లు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు ఇలా పట్టాలు తప్పడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉన్నాయని, 232 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ తెలిపారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.12 గంటల ప్రాంతంలో ఇంటా సిటీకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర సేవల విభాగానికి చెందిన అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను  ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. రైల్వే అధికారులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. 
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)