Breaking News

ఉక్రెయిన్ డ్రోన్ దాడులు, నాలుగు విమానాశ్రయాలపై ‍ప్రభావం

Published on Mon, 02/23/2026 - 10:21

రష్యా రాజధాని మాస్కో తో సహా రష్యన్ భూభాగంపై కైవ్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ఆదివారం మాస్కోలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.  డ్రోన్ల దాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రష్యా పౌర విమానయాన సంస్థ ఈ భద్రతా చర్యలు చేపట్టింది. దాదాపు 11 ఉక్రేనియన్ డ్రోన్‌లను రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఈ దీంతో డోమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్స్కీ ,షెరెమెటియేవో విమానాశ్రయాలపై ప్రభావం చూపింది .డ్రోన్ దాడులపై విమానయాన నియంత్రణ సంస్థ రోసావియాట్సియా విధించిన సస్పెన్షన్ల తర్వాత  అధికారులతో సంప్రదించిమాస్కోలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలు రాకపోకలకు తెరిచి ఉన్నాయని రోసావియాట్సియా ప్రకటించింది.

ఆదివారం మధ్యాహ్నం నాటికి మరో మానవరహిత వైమానిక వాహనాన్ని అడ్డగించినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ సోషల్ మీడియాలో ధృవీకరించారు. దీనితో కూలిపోయిన డ్రోన్‌ల మొత్తం సంఖ్య 11కి చేరుకుంది. 'వైమానిక రక్షణ దళాలు మరో UAVని అడ్డుకున్నాయి' అని సోబ్యానిన్ పోస్ట్ చేశారు, కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడంలో నగరం, విమాన నిరోధక వ్యవస్థల ప్రభావాన్ని నొక్కి చెప్పారు.

కైవ్‌పై ఉక్రెయిన్ దాడులు
తాజా డ్రోన్ సంఘటనలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా రాత్రిపూట భారీ దాడి తర్వాత జరిగాయి. రష్యన్ దళాలు 297 డ్రోన్‌లు,వివిధ రకాల 50 క్షిపణులను ప్రయోగించాయని ఉక్రెయిన్ వైమానిక దళం  వెల్లడించింది. వీటిలో, 274 డ్రోన్లు , 33 క్షిపణులను అడ్డగించాయి లేదా నాశనం చేశాయి. దీంతోఒకరు చనిపోగా,  అనేక మంది గాయపడ్డారు. మూడు క్షిపణులు ఇంకా గుర్తించలేదు.  నాలుగేళ్లయినా రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఇంకా తెరపడలేదు. ఉక్రెయిన్ వివిధ ప్రాంతాలపై, ముఖ్యంగా రాజధాని మాస్కోపై డ్రోన్ దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణి, డ్రోన్ దాడులను కొనసాగిస్తోంది. మాస్కోలో తాజా డ్రోన్ కూల్చివేతలు ఆధునిక యుద్ధంలో మానవరహిత వైమానిక వ్యవస్థల వినియోగం, వైమానిక ముప్పుల నుండి పౌరులను రక్షించడంలో సవాళ్లు చర్చనీయాంశ మవుతున్నాయి. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)