క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

Published on Sun, 12/07/2025 - 04:50

కీవ్‌: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఉక్రెయిన్‌పైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతూనే ఉన్నాయి. రష్యా మొత్తం 51 మిస్సైళ్లు, 653 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. వీటిలో 30 క్షిపణుల, 585 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయంది. 

మిగతా డ్రోన్లు, క్షిపణులతో కనీసం 29 ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొంది. తమ ఇంధన మౌలిక వనరులను రష్యా లక్ష్యంగా చేసుకుందని అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. కీవ్‌ ప్రాంతంలోని ఫాస్టివ్‌ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్‌ డ్రోన్‌ దాడితో పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. వివిధ ఘటనల్లో 8 మంది వరకు గాయాలపాలయ్యారన్నారు.

ఇలా ఉండగా, నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు, సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో అమెరికా, ఉక్రెయిన్‌ మధ్య రెండు రోజులుగా చర్చలు జరిగాయి. ఇందులో అధ్యక్షుడు ట్రంప్‌ అల్లుడు జెర్‌డ్‌ కుష్నర్, ట్రంప్‌ దూత స్టీవ్‌ విట్కాఫ్, ఉక్రెయిన్‌ ప్రతినిధి రుస్తెమ్‌ ఉమెరోవ్, ఆండ్రీ హనటోవ్‌లు పాల్గొంటున్నారు. అయితే, యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా నిజంగా సిద్ధంగా ఉంటేనే ఈ సంప్రదింపులతో సరైన ఫలితం లభించినట్లవుతుందని వారంటున్నారు. మూడో రోజు శనివారం కూడా వీరి చర్చలు కొనసాగుతున్నాయి.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)