Breaking News

బ్రిటన్‌ దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా

Published on Fri, 09/13/2024 - 13:45

మాస్కో: గూఢచర్యం ఆరోపణలపై  ఆరుగురు బ్రిటన్‌ దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. మాస్కోలోని బ్రిటన్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగురు దౌత్యవేత్తలు రష్యా కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేస్తున్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. దీని వల్ల రష్యా భద్రతకు ముప్పుండడంతో వారిని బహిష్కరించినట్లు వెల్లడించారు. 

బ్రిటిష్ ఎంబసీలోని ఆరుగురు సభ్యులు గూఢచర్యానికి పాల్పడినట్లుగా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ రష్యా ఆధారాలు సమర్పించింది. అయితే లండన్‌కు, మాస్కోకు మధ్య ఉన్న స్నేహం కారణంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బహిష్కరించామని అధికారులు తెలిపారు.గూఢచర్యంలో ఇతర దౌత్యవేత్తల ప్రమేయం ఉందని తెలిస్తే వారిని కూడా బహిష్కరిస్తామని చెప్పారు.

అయితే రష్యా చేసిన ఈ ఆరోపణలపై మాస్కోలోని బ్రిటన్  ఎంబసీ స్పందించలేదు. కాగా గూఢచర్యం ఆరోపణలతో రష్యా ఎంబసీలో రక్షణ వ్యవహారాలను పర్యవేక్షించే ఓ అధికారిని బ్రిటన్‌ ఇటీవల బహిష్కరించింది. ఇందుకు కౌంటర్‌గానే తాజాగా రష్యా బ్రిటన్‌ దౌత్యవేత్తలను బహిష్కరించి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. 

ఇదీ చదవండి.. ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజీనామా  

 

 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)