Breaking News

2033కల్లా రష్యా సొంత స్పేస్‌ స్టేషన్‌

Published on Tue, 07/23/2024 - 19:14

మాస్కో: ఇంటర్నేషనల్‌ స్పేస్‌స్టేషన్‌(ఐఎస్‌ఎస్‌) నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైన రష్యా  2033నాటికి సొంత స్పేస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకోనుంది. ఈ విషయాన్ని రష్యాస్టేట్‌స్పేస్‌కార్పొరేషన్ (రోస్‌కోస్మోస్‌) మంగళవారం(జులై 23)ప్రకటించింది. రష్యా ఆర్బిటల్‌ స్టేషన్‌(రోస్‌) ఏర్పాటు షెడ్యూల్‌ను సంస్థ చీఫ్‌ యూరి బొరిసోవ్‌ ఆమోదించినట్లు తెలిపింది. 

రోస్‌ను నిర్మించాలని 2021లోనే నిర్ణయించినట్లు తెలిపింది. 2027లో తొలి రీసెర్చ్‌ ఇంధన మాడ్యూల్‌ను లాంచ్‌ చేస్తామని వెల్లడించింది. దీని తర్వాత 2030లో యూనివర్సల్‌ నోడల్‌, గేట్‌వే, బేస్‌లైన్‌ మాడ్యూల్స్‌ను నింగిలోకి పంపుతామని తెలిపింది. అనంతరం కీలకమైన స్పెషల్‌ పర్పస్‌ మాడ్యూళ్లు టీఎస్‌ఎమ్‌1, టీఎస్‌ఎమ్‌2లను 2033కల్లా స్టేషన్‌కు అనుసంధానిస్తామని రోస్‌కోస్మోస్‌ వెల్లడించింది. 

స్పేస్‌ స్టేషన్‌ ప్రాజెక్ట్‌ కోసం సుమారు 7 బిలియన్‌  డాలర్ల వ్యయం చేస్తామని రోస్‌కోస్మోస్‌ తెలిపింది. 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా, యూరప్‌లు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఐఎస్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చేస్తామని అప్పట్లో రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికకు అమెరికా స్పందించకపోవడంతో ఐఎస్‌ఎస్‌ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకుంది. స్పేస్‌స్టేషన్‌లు వ్యోమగాములకు నింగిలో ఆశ్రయమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు దోహదపడతాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)