Breaking News

కింగ్‌ చార్లెస్ సర్‌ప్రైజ్‌.. క్రిస్మస్‌ సందడి షురూ!

Published on Sun, 12/07/2025 - 17:44

లండన్‌: ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలకు సిద్ధమవుతోంది. షాపింగ్ సెంటర్లు, వీధులు, ఇళ్లు క్రిస్మస్ లైట్లు, అలంకరణలు పండుగ థీమ్‌లతో మెరిసిపోతున్నాయి. ఇదే సమయంలో బ్రిటన్‌ దేశాధినేత, కామన్వెల్త్ దేశాల అధిపతి కింగ్ చార్లెస్ అతని సతీమణి క్వీన్ కెమిల్లాలు తమ 2025 అధికారిక క్రిస్మస్ కార్డును విడుదల చేసి, పండుగ సీజన్ ప్రారంభాన్ని ప్రకటించారు.

ఈ కార్డులో క్రిస్మస్ నేపథ్యానికి బదులుగా, ఈ జంట ఇటీవల ఇటలీ సందర్శన సందర్భంగా తీసిన ఫొటో ఉంది.  ఇది ఫోటోగ్రాఫర్ క్రిస్ జాక్సన్ తీసిన ఈ చిత్రం. రోమ్‌లోని విల్లా వోల్కోన్స్కీలో కింగ్ చార్లెస్ (77), క్వీన్ కెమిల్లా (78)లు ప్రశాంత వదనంతో ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. గత ఏప్రిల్‌లో వారి 20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఫోటో తీశారు. ఈ ఫొటోలో క్వీన్ కెమిల్లా.. అన్నా వాలెంటైన్ రూపొందించిన తెలుపు,లేత గోధుమ రంగు కోటు ధరించి కనిపిస్తుండగా, కింగ్ చార్లెస్ నీలిరంగు చారల సూట్‌లో హుందాగా కనిపిస్తున్నారు. కార్డు లోపల ఈ జంట తమ హృదయపూర్వక సందేశాన్ని ‘మీకు హ్యాపీ క్రిస్మస్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని తెలియజేస్తూ సంతకాలు చేశారు.

2005లో వివాహం చేసుకున్న ఈ రాజ దంపతులు, తమ 20 ఏళ్ల బంధాన్ని ఇటలీలో జరుపుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు, వారు పురాతన రోమన్ ఆక్వా క్లాడియా దగ్గర తీయించుకున్న ఫోటోలను విడుదల చేశారు. 20 సంవత్సరాల తమ వైవాహిక జీవన మైలురాయి గురించి క్వీన్ కెమిల్లా మాట్లాడుతూ, తమ బంధం అపురూపమైనదన్నారు. ఈ క్రిస్మస్ కార్డు కేవలం శుభాకాంక్షలను మాత్రమే కాకుండా, ఈ రాజ దంపతుల మొదటి పర్యటన, వారి 20 ఏళ్ల వివాహ బంధంలోని మధుర స్మృతులను తెలియజేసింది.
 

ఇది కూడా చదవండి: ఈయన క్లబ్‌లోనే మంటలు.. షాకిస్తున్న ఓనర్‌ బ్యాక్‌గ్రౌండ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)