రష్యా దూకుడుకు నాటో అడ్డుకట్ట..! సరిహద్దుల్లో "స్మార్ట్ వాల్"

Published on Sun, 01/25/2026 - 02:30

రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటో ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. యూరోపియన్ సరిహద్దుల వెంబడి సైనికులతో పనిలేకుండా, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబోటిక్ "ఆటోమేటెడ్ జోన్"ను నాటో ఏర్పాటు చేయబోతుంది.

ఈ విషయాన్ని నాటో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ థామస్ లోవిన్ శనివారం వెల్లడించారు. ఈ ఆటోమేటెడ్ జోన్ ఒక రక్షణ గోడలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ ఆటోమేటెడ్ జోన్‌లోకి శత్రు సైన్యం ప్రవేశిస్తే  గుర్తించడానికి డ్రోన్లు, సెమీ-అటానమస్ యుద్ధ వాహనాలు, భూమిపై నడిచే రోబోలు, ఆటోమేటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి.

ఇవి శత్రువుల కదలికలను సెకన్లలో పసిగడతాయి. వెంటనే నాటోదేశాలకు సమాచారం అందుతుంది. అయితే ప్రాణాంతకమైన ఆయుధాలను ప్రయోగించాలా వద్దా అనే నిర్ణయం మాత్రం మనిషి చేతుల్లోనే చేతుల్లోనే ఉంటుందని వెల్ట్ ఆమ్ సోన్‌టాగ్ అనే జర్మన్  వార్తాపత్రికతో లోవిన్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ సాంకేతికతను పోలాండ్ మరియు రోమేనియా దేశాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. 2027 చివరి నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నాటో లక్ష్యంగా పెట్టుకుంది.
 

#

Tags : 1

Videos

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)