Breaking News

ఇదేందయ్యా ఇది..! మొన్న విషం.. ఇప్పుడేమో కలిసి పంచుకున్నాడు

Published on Mon, 11/18/2024 - 08:21

వాషింగ్టన్‌: అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్  తన ప్రభుత్వంలో ఆరోగ్య శాఖకు అధిపతిగా రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌ను నియమించారు. ఈయన అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌ తినే ఫాస్ట్‌ ఫుడ్‌ను విషంగా అభివర్ణించి, ఇప్పుడు ట్రంప్‌ పక్కన కూర్చుని ఫాస్ట్‌ ఫుడ్‌ను తింటున్న ఉదంతానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియా సైట్‌ ‘ఎక్స్‌’లో డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ షేర్‌ చేసిన ఫొటోలో ఎలన్ మస్క్, ట్రంప్, యూఎస్‌ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ కూడా ఉన్నారు. అలాగే ఈ ఫొటోలో కెన్నెడీ జూనియర్ మెక్‌డొనాల్డ్స్ బర్గర్‌ను  చేతిలో పట్టుకోవడం కనిపిస్తుంది. అక్కడి టేబుల్‌పై కోకా-కోలా బాటిల్‌ కూడా కనిపిస్తోంది. దీనికితోడు మెక్‌డొనాల్డ్స్ బర్గర్, ఫ్రైస్ ఉన్న ప్లేటు ట్రంప్, మస్క్ ముందు  ఉంచారు. ట్రంప్ జూనియర్ ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్ టుమారో స్టార్ట్స్’ అనే క్యాప్షన్‌తో చిత్రాన్ని  షేర్‌ చేశారు.

ట్రంప్, ఇలాన్ మస్క్ తో కలిసి బర్గర్ తిన్న కెన్నెడీ జూనియర్
 

ఇటీవల ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూలో కెన్నెడీ జూనియర్ ట్రంప్ తినేవాటిని ‘విషం’గా అభివర్ణించారు. ప్రచార సమయంలో ఆయన ట్రంప్ చెడ్డ ఆహారం తింటున్నారని పేర్కొన్నారు. ఈయన గతంలో  దుకాణాల్లోని షెల్ఫ్‌ల నుండి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ‍ప్యాకెట్లను తొలగించాలని కోరారు. అయితే అమెరికాలో ఫాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌కున్న ప్రాముఖ్యతను కెన్నెడీ జూనియర్ ఒప్పుకున్నారు.

ఇది కూడా చదవండి: మంచు కురిసే వేళలో.. మూడింతలైన కశ్మీర్‌ అందాలు

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)