Breaking News

ట్రంప్‌కు కెన్నెడీ జూనియర్‌ మద్దతు

Published on Sun, 08/25/2024 - 11:22

ఫీనిక్స్‌: అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎఫ్‌.కెన్నెడీ కుటుంబీకుడొకరు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. స్వతంత్ర అభ్యరి్థగా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా ఆయన శుక్రవారం వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్‌ ఎన్నికల రేసు నుంచి తప్పుకుని, భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను బలపరిచాక డెమొక్రటిక్‌ పార్టీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుండగా, ట్రంప్‌ ప్రచారంలో వెనుకబడ్డారు. 

పలు కీలక రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయం కూడా హారిస్‌కు అనుకూలంగా మారింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌నకు రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ జూనియర్‌ మద్దతు ప్రకటించడం రిపబ్లికన్‌ పారీ్టలో కొత్త ఉత్సాహం నింపినట్లయింది. ఇటీవలి వరకు ట్రంప్‌ విధానాలను ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అనుచరగణాన్ని ఆయన పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రంప్‌ కూడా..అధ్యక్ష రేసులో అత్యంత తీవ్ర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నడీని విమర్శించారు. తాజాగా తన నిర్ణయాన్ని సమరి్ధంచుకుంటూ రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ.. ‘ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌ యుద్ధం భవిష్యత్తు తరాలపై జరుగుతున్న యుద్ధం..దీనిని వెంటనే ఆపాలి. అందుకే ట్రంప్‌కు మద్దతిస్తున్నా’అని ప్రకటించారు. 

రాబర్ట్‌ నిర్ణయాన్ని కెన్నడీ కుటుంబంలోని ఐదుగురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్‌కు మద్దతివ్వడం ‘విషాద గాథకు విషాదాంతం’వంటిదని రాబ ర్ట్‌ సోదరి కెర్రీ కెన్నెడీ వ్యాఖ్యానించారు. ‘హారిస్, వాల్జ్‌లపై మాకు విశ్వాసం ఉంది. ట్రంప్‌ను సమర్థించాలనే మా సోదరుడు రాబర్ట్‌ నిర్ణయం మా నాన్నకు, మా కుటుంబం అత్యంత ప్రియమైనవిగా భావించే విలువలకు ద్రోహం చేసినట్లే’అని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జాన్‌ ఎఫ్‌.కెన్నడీ సోదరుడు, దివంగత అటార్నీ జనరల్, సెనేటర్‌ రాబర్ట్‌ కెన్నడీ కుమారుడే రాబర్ట్‌ ఎఫ్‌.కెన్నెడీ జూనియర్‌.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)