Breaking News

ఈజిప్టులో రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Published on Tue, 10/15/2024 - 09:23

కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐన్ సోఖ్నా హైవేపై ఈ ఘటన జరిగిందని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

బస్సులో సూయజ్‌లోని గలాలా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ బస్సు ఐన్ సోఖ్నా హైవే మీదుగా వెళుతుండగా ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి 28 అంబులెన్స్‌లు చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని  ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులకు సూయజ్ మెడికల్ కాంప్లెక్స్‌లో చికిత్స అందిస్తున్నారు.

ఈజిప్టులో ప్రతి ఏటా వేలాది మంది  రోడ్డు ప్రమాదాలలో మృతి చెందుతున్నారు. దేశంలో రవాణా భద్రత రికార్డు అధ్వాన్నంగా ఉంది. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కారణంగా దేశంలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇది  కూడా చదవండి: రాజధానిలో నేటి నుంచి ‘గ్రాప్‌-1’ అమలు

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)