రిషి సునాక్ వాడుతున్న పెన్నుపై వివాదం.. ఎందుకంటే..?

Published on Wed, 06/28/2023 - 17:28

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ అధికారిక పత్రాలపై ఎరేజబుల్ (చెరిపివేయదగిన) ఇంక్‌ పెన్నులను వాడుతారని గార్డియన్ పత్రిక తెలిపింది. దీంతో అధికారిక పత్రాల భద్రత అంశాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛాన్సలర్‌గా పనిచేసినప్పుడు కూడా అవే పెన్నులను రిషి సునాక్ ఉపయోగించినట్లు గార్డియన్ తన నివేదికలో వెల్లడించింది. చెరిపివేయదగిన ఇంక్ పెన్నులను వాడితే.. అధికారిక పత్రాలపై రాతలను తారుమారు చేసే అవకాశం ఉండకపోదని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. చరిత్ర గుర్తుంచుకోవాల్సిన పత్రాలపై అలాంటి పెన్నుల వాడకాన్ని విమర్శిస్తున్నారు. 

రిషి సునాక్ ఉపయోగించే పెన్నులు యూకేలో ఒక్కోటి రూ.495 ఖరీదు ఉంటాయి. వాటిపై ఎరేజబుల్ అనే లోగో కూడా ఉంటుందని గార్డియన్ వెల్లడించింది. ఇంక్‌తో రాయడం నేర్చుకునేవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే తప్పు రాస్తే ఎరాడికేటర్లతో వెంటనే చెరిపివేసుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఆ సంస్థ కూడా మార్కెటింగ్ చేస్తుందని గార్డియన్ పేర్కొంది. 

రిషి సునాక్ అధికారిక కార్యదర్శి మాత్రం ఈ విషయాన్ని ఖండించారు. సునాక్ వాడుతున్న పెన్నులు బ్రిటన్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు వాడుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులకు ఆ పెన్నులనే పంపిస్తున్నామని అన్నారు. చెరిగిపోయే పనులను ప్రధాని రిషి సునాక్ ఎన్నటికీ చేయరని స్పష్టం చేశారు. 

అయితే.. గతంలో క్యాబినెట్‌లో రిషి సునాక్ ఎరేజబుల్ పెన్నులను ఉపయోగిస్తున్న ఫొటోలు కూడా బయటకు ప్రచారం అయ్యాయి. పలు అధికారిక సమావేశంలోనూ ఆ పెన్నులను ఉపయోగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అన్‌లాక్ డెమోక్రసీ గ్రూప్ అధ్యక్షుడు టామ్‌ బ్రేక్‌ ప్రజల నమ్మకాలను తుడిచేయడమే ఆ పెన్నుల వాడకానికి ఉద్దేశమని విమర్శించారు. రాజకీయ నాయకుల మాటలకు నమ్మకం తక్కువ. ఎరేజబుల్ ఇంక్ పెన్నుల వాడకంతో ఆ నమ్మకం ఇక పాతాళానికి చేరుతుందని అన్నారు. 

ఇదీ చదవండి: 'కరోనా వైరస్‌ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)