Breaking News

గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు 

Published on Sat, 07/29/2023 - 18:02

లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్న కొంతమంది పర్యాటకులు ఆ క్యాబిన్ స్ట్రక్ అయిపోవడంతో తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. చాలా సేపటి తర్వాత ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ వారు రంగంలోకి దిగిన తర్వాత అందులోని వారిని సురక్షితంగా కిందకు దించడంతో పెనుప్రమాదం తప్పింది.     

రోలర్ కోస్టర్ రైడ్ అంటే కొంతమందికి మహా సరదా. ఎత్తు పల్లాల్లో వేగంగా దూసుకుపోయే ఈ రైడ్‌లో ప్రయాణిస్తుంటే ప్రాణం గాల్లో తేలియాడుతూ మహదానందంగా ఉంటుంది. కానీ ఇదే రోలర్ కోస్టర్ రైడ్‌లో ఏదైనా అపశ్రుతి దొర్లితే జరిగే ప్రమాదం ఊహకు కూడా అందదు. 

అచ్చంగా అలాంటి ప్రమాదానికే అంచుల వరకు వెళ్లి తప్పించుకున్నారు లండన్‌లోని ఓ రోలర్ కోస్టర్‌లో ప్రయాణిస్తున్నవారు. ఈ రోలర్ కోస్టర్ మొదలైనప్పుడు మొదట భూమికి లంబంగా పైకి వెళ్తుంది... ఇక అక్కడి నుండి కిందకి జారుకుంటూ రివ్వున దూసుకుపోతుంది. కానీ ఇది పైకి వెళ్తున్నప్పుడే భూమికి సుమారు 72 అడుగుల ఎత్తులో ఆగిపోయింది. 

ఇందులో ఒకామె తన ఆరేళ్ళ  కుమార్తెతో సహా ఇరుక్కుపోయింది. ఏం జరిగిందో అర్ధంకాక వారు బిక్కుబిక్కుమంటూ గుటకలు మింగుతూ ఉండిపోయారు. ఏదైనా జరగరానిది జరిగి పట్టుతప్పితే వారు కిందకి వచ్చేలోపే వారి ప్రాణాలు పైకి పోతాయి. అదృష్టవశాత్తు ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్ సిబ్బంది సమయానికి స్పందించడంతో అందులో ఇరుక్కున్నవారిని సురక్షితంగా కిందకు దించారు. 

ఇది కూడా చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే చాంపియన్ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)