Breaking News

ఓ సముద్రజీవి.. ఐదేళ్ల ఉపవాసం!

Published on Tue, 07/07/2026 - 19:26

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఒక్క రోజు ఉపవాసం ఉండటమే మనకు కష్టమనిపిస్తుంది. కానీ ఆహారం తినకుండా ఐదేళ్లపాటు జీవించగల ఒక వింత జీవి ఉన్నట్లు చైనా పరిశోధకులు గుర్తించారు. ఆ జీవి పేరు సూపర్‌జైంట్‌ ఐసోపాడ్‌ (supergiant isopod). సముద్రగర్భంలో నివసించే ఈ జీవి మనుగడ రహస్యాన్ని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ పరిశోధకులు ఛేదించారు. ఈ పరిశోధన వివరాలు సెల్‌ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.

సముద్ర గర్భంలో చీకటి, తీవ్రమైన ఆహార కొరత, అతిశీతల పరిస్థితుల మధ్య ఈ భారీ ఐసోపాడ్‌లు నివసిస్తాయి. చనిపోయిన తిమింగలాలు, చేపల కళేబరాలను తిని బతుకుతాయి. దొరికినప్పుడు కడుపు పగిలేలా కదల్లేనంతగా తింటాయి. మళ్లీ ఐదేళ్ల వరకు ఏమీ దొరక్కపోయినా బతకగలగటం వాటి ప్రత్యేకత. విలక్షణమైన శరీర అమరిక, ప్రత్యేక జన్యువులే ఈ సుదీర్ఘ, అద్భుత మనుగడ సామర్థ్యానికి కారణమని పరిశోధకులు గుర్తించారు.

పెద్ద జీర్ణాశయం.. ప్రత్యేక జన్యువు.. 
20 అంగుళాల సైజు వరకు పెరిగే ఈ ఐసోపాడ్‌లలో జీర్ణాశయం చాలా పెద్దది. మొత్తం శరీరంలో దాదాపు మూడింట రెండు వంతులు వాటి పొట్టే ఆక్రమిస్తుంది. ఆహారం దొరికినప్పుడు భారీ మొత్తంలో నిల్వ చేసుకోగలవు. ఒక ప్రత్యేక జన్యువు ఏళ్ల తరబడి ఉపవాసానికి దోహదపడుతోందట. అదే ‘ఎన్‌డీ1’. ఇది స్వతహాగా వాటిది కాదు. ఒక బ్యాక్టీరియా నుంచి గ్రహించిన జన్యువు కావడం విశేషం.

తీవ్రమైన చలి వాతావరణంలో ఈ జన్యువు ఒక స్విచ్‌లా పనిచేసి, ప్రాథమిక జీవక్రియ రేటు (బీఎంఆర్‌)ను అత్యంత కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది. దీనివల్ల శరీరంలో నిల్వ ఉన్న శక్తి చాలా నెమ్మదిగా ఖర్చవుతుంది. వాటికి గల వినూత్న శారీరక, జన్యుపరమైన రక్షణ విధానం వల్లే సుదీర్ఘకాలం ఉపవాసం ఉంటూ ప్రాణాలు నిలుపుకోగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన చలి వాతావరణంలో ఆకలిని తట్టుకునే సామర్థ్యాన్ని ఈ జన్యువు 37% మేర పెంచుతోందని పరిశోధనల్లో తేలింది.

చ‌ద‌వండి: బ్యాటరీ రీచార్జ్‌.. భిక్షాందేహీ...!

ఈ జీవి జీర్ణాశయంలో ఉండే క్లామిడియా అనే బ్యాక్టీరియా కొవ్వును సమర్థంగా నిల్వ చేయడానికి సహాయపడుతోందట. వ్యోమగాములు, అతిశీతల ప్రదేశాల్లో సైనికుల ఆహార అవసరాలు తీర్చే పరిశోధనలకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని భావిస్తున్నారు. అంతేనా..? మనుషుల్లో ఊబకాయాన్ని తగ్గించే ఔషధాల తయారీకీ భవిష్యత్తులో ఉపయోగపడొచ్చేమో!  

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)