Breaking News

అమెరికా పార్లమెంట్‌లో బాత్‌రూమ్‌ గొడవ

Published on Thu, 11/21/2024 - 07:53

వాషింగ్టన్‌ : అమెరికా పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికై చరిత్ర సృష్టించిన డెమొక్రటిక్‌ నేత, ట్రాన్స్‌జెండర్‌ సారా మెక్‌బ్రైడ్‌పై అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇన్నాళ్లూ పబ్లిక్‌ టాయిలెట్లు, పాఠశాలల్లో ట్రాన్స్‌జెండర్లు ఏ బాత్‌రూమ్‌ వాడాలన్న దానిపై మొదలైన చర్చ ఇప్పుడు పార్లమెంట్‌లోనూ జరగబోతోంది. అయితే పార్లమెంట్‌ ఇరుసభలైన ప్రతినిధుల సభ, సెనేట్‌లో రిపబ్లికన్లదే ఆధిపత్యంకావడంతో వారు ప్రతిపాదించే బిల్లు ఆమోదం పొందే అవకాశాలే ఎక్కువ. అయితే వ్యక్తి గౌరవాన్ని భంగపరుస్తూ ఏకైక ట్రాన్స్‌జెండర్‌ చట్టసభ మెంబర్‌పై రిపబ్లికన్‌ సభ్యులంతా ఏకమై విరుచుకుపడతారా? అని డెమొక్రాట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

అధ్యక్ష ఎన్నికలతోపాటు సెనేట్, ప్రతినిధుల సభకూ ఎన్నికలు జరిగాయి. ప్రతినిధుల సభ ఎన్నికల్లో భాగంగా డెలావర్‌లోని ఎట్‌ లార్జ్‌ హౌస్‌ డి్రస్టిక్ట్‌ నుంచి రిపబ్లికన్‌ అభ్యరి్థపై 72వేలకుపైగా మెజారిటీతో గెలిచి అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా 34 ఏళ్ల సారా రికార్డుసృష్టించడం తెల్సిందే. అయితే పురుషునిగా జన్మించి ట్రాన్స్‌జెండర్‌గా మారినంతమాత్రాన సారాను మహిళల బాత్‌రూమ్‌లోకి అనుమతించబోమని రిపబ్లికన్‌ నాయకురాలు, సౌత్‌ కరోలినా ఫస్ట్‌ కాంగ్రెషనల్‌ డిస్టిక్ట్‌ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన నాన్సీ మేస్‌ కరాఖండీగా చెప్పారు. ఈ మేరకు సారాను అడ్డుకోవాలంటూ హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌లో ఆమె బిల్లు ప్రవేశపెట్టారు. ‘‘సారాకు వ్యతిరేకంగా మేం ఇంత మాట్లాడుతున్నా సారా నుంచి స్పందన లేదు. 

అంటే తను పురుషుడు అని ఒప్పుకున్నట్లే. మేం సారాను మహిళల బాత్రూమ్, స్పేస్, లాక్‌ రూమ్, చేంజింగ్‌ రూమ్‌లకు అనుమతించబోం. ఈ మేరకు పార్లమెంట్‌ ప్రోటోకాల్‌ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి’’అని నాన్సీ మేస్‌ డిమాండ్‌చేశారు. ఈ ఉదంతంపై సారా స్పందించారు. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే రిపబ్లికన్లు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతి ఒక్క అమెరికన్‌కు తనకు నచ్చినట్లు జీవించే హక్కుంది. ఈ హక్కును గౌరవిస్తూ, పార్లమెంట్‌ సభ్యులు సభలో నాకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నా’అని సారా ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేశారు. జన్మతః పురుషుడైన సారా తన 21 ఏళ్ల వయసులో అమ్మాయిగా మారాడు.   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు