Breaking News

కమలా హారిస్‌కు ఘోర అవమానం

Published on Wed, 01/08/2025 - 07:53

వాషింగ్టన్ : అమెరికా సెనేటర్ల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ ప్రమాణ స్వీకారంలో  డెమోక్రటిక్‌ పార్టీ నేత, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే? 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ సెనేటర్లతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris) ప్రమాణం స్వీకారం చేయించారు. వారిలో రిపబ్లికన్‌ సెనేటర్‌ డెబ్‌ ఫిషర్‌ (Deb Fischer) సైతం ఉన్నారు. డెబ్‌ ఫిషర్‌ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత డెబ్‌ పిషర్‌ కమలా హారిస్‌కు కరచాలనం చేశారు. అనంతరం, తన భర్త బ్రూస్‌ ఫిషర్‌ను కమలా హారిస్‌కు పరిచయం చేయించారు. ముందుకు వెళ్లి హారిస్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వమని కోరారు.

అయితే, అందుకు బ్రూస్‌ ఫిషర్‌ అంగీకరించలేదు.  కమలా హారిస్‌ ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో సెనేట్లరతో పాటు కమలా హారిస్‌ సైతం కొంచెం ఇబ్బంది పడ్డారు. వెంటనే .. ‘ఫర్వాలేదు బ్రూస్‌ ఫిషర్‌ నేను తిట్టను.. కంగారుపడకు’ అంటూ సరదాగా అన్నారు.

 

ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కానీ పలువురు ఉదారవాదులు బ్రూస్‌ ఫిషర్‌పై సోషల్‌ మీడియా (social media) వేదికగా మండిపడుతున్నారు. 

పాడ్‌కాస్టర్‌ బ్రియాన్ టైలర్ కోహెన్ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘రిపబ్లికన్ సెనేటర్ భర్త బ్రూస్‌ ఫిషర్‌ కరచాలనం చేసేందుకు, వైస్ ప్రెసిడెంట్ హారిస్‌ను చూసేందుకు సైతం ఇష్టపడలేదు. ఆయన తీరు రిపబ్లికన్‌ పార్టీ లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని పేర్కొన్నారు.  

రచయిత డాన్ విన్స్లో మరో అడుగు ముందుకు వేసి బ్రూస్‌ను పందితో పోల్చారు. బ్రూస్‌ తీరు అవమానకరంగా ఉంది. హారిస్‌తో కరచాలం చేసేందుకు ఇష్టపడలేదు. ‘ బ్రూస్‌ వ్యవహరించిన తీరు చూస్తుంటే.. పందులు పొలాల్లోనే ఉండవు. అతను ఒక పంది’అంటూ సంభోదించారు. ఈ అంశంపై డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)