Breaking News

ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీకి ఎదురుదెబ్బ!.. తెరపైకి జేడీ వ్యాన్స్‌ వ్యాఖ్యలు

Published on Fri, 07/26/2024 - 11:41

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే రిప‍బ్లికన్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి జేడీ వ్యాన్స్‌ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. పిల్లలు లేనివారు పాలించేందుకు తగదు అంటూ గతంలో మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను కించపరిచినట్లు మాట్లాడారు. తాజాగా దీనిపై తాజాగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా రిపబ్లిక్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్‌ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాగా, జేడీ వ్యాన్స్‌ 2021లో అమెరికాలో పిల్లలులేని తల్లుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో జేడీ వ్యాన్స్‌ మాట్లాడుతూ.. అమెరికాలో పిల్లలందరికీ ఓట్లు వేసే అవకాశం ఇద్దాం. ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులకు ఆ ఓట్లపై నియంత్రణ ఉండేలా చూసుకుందాం. మీరు అమెరికాలో ఎన్నికలకు వెళ్లినప్పుడు ఒక పేరెంట్‌గా మరింత శక్తిని కలిగి ఉండాలి. పిల్లలు లేని వారి కంటే పిల్లులు ఉన్న పేరెంట్స్‌కి ప్రజాస్వామ్యంపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. వారే తమ వాయిస్‌ వినిపించగలరు. ఇదే సమయంలో పిల్లలు లేని వారు వాయిస్‌ను ఎక్కువ వినిపించలేరు(చైల్డ్‌ లెస్‌ క్యాట్‌ లేడీస్‌). పిల్లలు లేని వారు పాలించేందుకు పనికిరారు అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాన్స్‌ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అయితే, అధ్యక్ష ఎన్నికల వేళ జేడీ వ్యాన్స్‌ వ్యాఖ్యలు తాజాగా మరోసారి వైరల్‌గా మారాయి. డెమోక్రటిక్‌ పార్టీ నేతలు వ్యాన్స్‌ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రిపబ్లిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఒకప్పుడు తనను వ్యతిరేకించే వ్యక్తినే ట్రంప్ ఎంపిక చేశారు. రిపబ్లికన్ నేత, ఓహియో సెనేటర్ జేమ్స్ వ్యాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్ ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. జేడీ వాన్స్ ఉపాధ్యాక్షుడవుతారు. ఒకానొక సమయంలో ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడి వార్తల్లో నిలిచిన వ్యాన్స్‌.. ప్రస్తుతం ఆయనకు బలమైన మద్దతుదారుల్లో ఒకరిగా మారిపోవడం గమనార్హం.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)