ఎర్ర సముద్రంలో భారత నౌకపై దాడి.. నీట మునక

Published on Wed, 08/05/2026 - 06:42

ఎర్ర సముద్రంలో భారత వాణిజ్య నౌకపై దాడి జరిగింది!. యెమెన్‌ తీరంలో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 14 మందిని యెమెన్‌ కోస్ట్‌గార్డ్‌ సురక్షితంగా రక్షించింది. ఈ దాడి ఎవరి పని? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఎంఎస్‌వీ ఫైజ్‌ నూర్‌ ఒలియా (MSV Faize Noore Oliya) అనే నౌకపై గుర్తుతెలియని వస్తువు(క్షిపణి/పేలుడు పదార్థం) వచ్చి తగలడంతో అది బోల్తా పడి మునిగిపోయినట్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బందిని యెమెన్‌ కోస్ట్‌గార్డ్‌ సహాయక చర్యలు చేపట్టి రక్షించి మొఖా పోర్టుకు తరలించినట్లు వెల్లడించారు. వాళ్లలో 13 మంది భారతీయులు, ఓ విదేశీయుడు ఉన్నాడు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 

పౌర నౌకపై జరిగిన ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి రక్షణ లేకుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకర పరిణామమని పేర్కొంది. భారతీయ నావికుల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని సోనోవాల్‌ తెలిపారు. రక్షించబడిన సిబ్బందికి అవసరమైన సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఘటనపై స్పందించింది. భారత జెండాతో ఉన్న వాణిజ్య నౌకపై జరిగిన దాడిని ఖండిస్తూ.. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం యెమెన్‌ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది. సిబ్బంది రక్షణలో సహకరించిన యెమెన్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది.

అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన మరింత ఆందోళనకు దారితీసింది.

ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఎర్ర సముద్రం ఒకటి. సుయాజ్‌ కాలువ ద్వారా యూరప్‌, ఆసియాలను కలిపే ఈ మార్గంలో ఇటీవలి కాలంలో భద్రతా సమస్యలు పెరిగాయి. ముఖ్యంగా యెమెన్‌ సమీపంలోని బాబ్‌ అల్‌ మండెబ్‌ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో పలు అంతర్జాతీయ షిప్పింగ్‌ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)