Breaking News

పిలిచి మరీ ఉద్యోగం ఇస్తానంటే ఇలా చేస్తారా?.. రిక్రూటర్‌కు చిర్రెత్తి..

Published on Thu, 02/20/2025 - 18:32

నేను పిలిచి జాబిస్తానంటే ఇలా చేస్తారా? అంటూ ఓ ఉద్యోగిపై అప్పుడే ఇంటర్వ్యూ చేసిన రిక్రూటర్ (recruiter) అసహనానికి గురయ్యాడు.ఆ తర్వాత ఏం చేశాడంటే?

లండన్‌కు చెందిన ఓ రిక్రూటర్‌ లింక్డిన్‌ (LinkedIn)లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఆపోస్ట్‌లో తన పగిలిపోయిన కీబోర్డును షేర్‌ చేస్తూ..చివరి క్షణంలో అభ్యర్థి జాబ్‌ ఆఫర్‌ను తిరస్కరించాడు. దీంతో కోపం కట్టలు తెచ్చుకుంది. వెంటనే ఈ కీబోర్డును పగులగొట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సోషల్‌ మీడియా పోస్టు నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?  

లింక్డిన్‌ పోస్ట్ ప్రకారం..రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెంట్ ఏతాన్ మూనీ (Ethan Mooney) ఇటీవల ఓ అభ్యర్థికి రెండో రౌండ్‌ ఇంటర్వ్యూ చేసేందుకు సిద్ధమైంది. కన్ఫామ్‌ అయితే జాబ్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రిక్రూటర్‌.. అభ్యర్థికి రెండో రౌండ్‌ ఇంటర్వ్యూ చేసేందుకు ఉదయం 9:30 గంటలకు షెడ్యూల్‌ సిద్ధం చేశారు.

సమయం 9:30 దాటింది. కానీ అభ్యర్థి ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్‌ కాలేదు. అరంగంటైంది. రిక్రూటర్‌లో అసహనం ఎక్కువైంది. సరిగ్గా ఆ సమయంలో సదరు రిక్రూటర్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. సారీ సార్‌.. ‘నేను మీకు కంపెనీ ఇంటర్వ్యూకి రావడం లేదు. నాకు వేరే సంస్థలో ఉద్యోగం వచ్చింది. మీ జాబ్‌ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నాను థ్యాంక్యూ’ అనేది ఆ మెసేజ్‌ సారాంశం. దీంతో రిక్రూటర్‌కు చిర్రెత్తి పక్కనే ఉన్న కంప్యూటర్‌ కీబోర్డును పగుల గొట్టాడు.  

నిజం చెప్పాలంటే, ఆ సమయంలో నాకు ఈ కీబోర్డు కనిపించలేదు. రిక్రూటర్లు.. ఉద్యోగార్థుల గురించి పట్టించుకోరు అని ఎవరైనా అంటారు? అని కామెంట్‌ చేస్తూ పగిలిన కీబోర్డు ఫొటోల్ని షేర్‌ చేశారు. ఈ ఘటన నెట్టింట్లో చర్చకు దారి తీసింది. కొందరు ఇంటర్వ్యూ జరిగే సమయంలో అభ్యర్థి రాకపోతే హైరింగ్‌ ప్రాసెస్‌లో తలెత్తే ఇబ్బందుల్ని ప్రశ్నిస్తుంటే మరికొందరు..రిక్రూట్‌మెంట్‌ కన్సల్టెంట్ ఏతాన్ మూనీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)