Breaking News

పాక్‌ పార్లమెంటులో ఎలుకల వేట!

Published on Thu, 08/22/2024 - 11:09

మనకు రామాయణంలో పిడకల వేట తెలుసు. ఇప్పుడు పాక్‌ పార్లమెంట్‌ ఎలుకల వేట సాగుతోంది! పార్లమెంటు భవనంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయట. 2008 నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని అధికారిక కమిటీ ఒకటి కోరడంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది. రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించడంతో ఇదెవరి పనా అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది.వాటి ఆకారాలు కూడా అలా ఇలా లేవట. ‘‘ఎలుకలు ఎంత పెద్దగా ఎన్నాయంటే, బహుశా పిల్లులు కూడా వాటికి భయపడిపోతాయేమో! మా సిబ్బందికంటే వాటిని చూసీ చూసీ అలవాటైపోయింది.

 కానీ తొలిసారి వచ్చేవాళ్లంతా ఈ ఎలుకల విరాట్‌ స్వరూపాలను చూసి వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు’’ అని నేషనల్‌ అసెంబ్లీ అధికార ప్రతినిధి జాఫర్‌ సుల్తాన్‌ వాపోయారు. రికార్డులు మొదలుకుని దొరికిన దాన్నల్లా ఈ ఎలుకలు హాం ఫట్‌ అనిపిస్తున్నాయట. దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్‌లో 12 లక్షలు కేటాయించాల్సి వచి్చంది! ఎలుకలను ట్రాప్‌ చేయడానికి ప్రత్యేక నెట్‌ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. 

‘పార్లమెంటులో మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీచప్పుడూ లేకుండా ఎక్కడో నక్కుతాయి. అంతా నిర్మానుష్యం కాగానే పార్లమెంట్‌ ఆవరణను మారథాన్‌ ట్రాకుగా మార్చేసుకుంటున్నాయి. ఇంత తెలివైన ఎలుకలను నేనెప్పుడూ చూడలేదు’’ అని జాఫర్‌ చెప్పుకొ చ్చారు. విపక్ష నాయకుని కార్యాలయం, స్టాండింగ్‌ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. చివరికి వీటి కట్టడికి పెస్ట్‌ కంట్రోల్‌ కంపెనీల కోసం పేపర్‌ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచి్చందట! 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)