Breaking News

Russia: మహిళలపై పుతిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 03/09/2024 - 12:32

మాస్కో: మహిళా దినోత్సవం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు. మాతృత్వపు బహుమతులను వారు అందిస్తున్నారని కీర్తించారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మార్చ్‌ 8)నాడు పుతిన్‌ దేశంలోని మహిళలను ఉద్దేశించి మాట్లాడారు.

‘మహిళలు క్లిష్టతరమైన బాధ్యతలు వేగంగా, సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు మగవారి పట్ల చాలా కేరింగ్‌గా ఉంటారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ వారెప్పుడూ అందంగానే వెలిగిపోతుంటారు’అని పుతిన్‌ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో రష్యాలో బర్త్‌రేటు పెంచే ప్రచారాన్ని పుతిన్‌ తీవ్రం చేశారు.

ముగ్గురు పిల్లలున్న యువ తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహిళా దినోత్సవం సందర్భంగా పుతిన్‌ మరోసారి స్పష్టం చేశారు. గత వారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ ముగ్గురు అంతకంటే ఎక్కువ పిల్లలున్న తల్లిదండ్రులు దేశానికి గొప్ప గౌరవం అని పుతిన్‌ కీర్తించడం గమనార్హం. కాగా, సోవియెట్‌ కాలం నుంచి రష్యాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. మార్చి 8 వుమెన్స్‌ డేను హాలిడేగా ప్రకటించి మహిళలకు భారీగా బహుమతులు అందిస్తారు.   

ఇదీ చదవండి.. ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మర్డోక్‌ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)