Breaking News

పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్

Published on Tue, 10/24/2023 - 18:57

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను క్రెమ్లిన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేసింది. పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పందించారు. బాడీ డబుల్స్‌ను వాడుతున్నారని నిరాధార ఆరోపణలను కొట్టిపారేశారు. అదంతా అబద్ధంగా పేర్కొన్నారు. 

పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో వదంతులు వచ్చాయని పేర్కొంటూ ప్రశ్చ్యాత దేశాల మీడియా ప్రచురణలు వెలుగులోకి వచ్చాయి. పుతిన్ (71) క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో సహా తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నట్లు 2022 నుంచే వివిధ నివేదికలు వస్తున్నాయి. బహిరంగ ప్రదర్శనలలోనూ పుతిన్  అస్థిరంగా, ఉబ్బినట్లుగా కనిపించడం ఈ పుకార్లకు అప్పట్లోనే ఆజ్యం పోసింది. 

తాజాగా సెప్టెంబర్‌లో రష్యాన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఓ పోస్టు దర్శనమిచ్చింది.'మీరు మమ్మల్ని విడిచిపెట్టవద్దు. సజీవంగా ఆరోగ్యంగా ఉన్నారని దేవుడిని ప్రార్ధిస్తున్నాం' అంటూ ఓ పోస్టు వెలుగులోకి వచ్చింది. దీంతో మీడియా ప్రతినిధులు పుతిన్ ఆరోగ్యంపై  క్రెమ్లిన్ ప్రతినిధిని తాజాగా ప్రశ్నించారు.  బాడీ డబుల్స్‌కు సంబంధించి 2020లోనే పుకార్లు వచ్చాయి. భద్రతా ప్రయోజనాలు దృష్ట్యా ఓ దేహాన్ని ఉపయోగించారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ పుకార్లను క్రెమ్లిన్ అప్పట్లోనే ఖండించింది.

ఇదీ చదవండి: లండన్ నడిబొడ్డున జిహాద్ నినాదాలు.. రిషి సునాక్ ఆగ్రహం


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)