Breaking News

Russia: ప్రతిపక్ష నేతలకు పుతిన్‌ భయం..!

Published on Fri, 02/16/2024 - 21:11

మాస్కో: పుతిన్‌ విమర్శకుడు, రష్యా ప్రతిపక్షనేత అలెక్సీ నావల్ని(47) శుక్రవారం దేశంలోని ఆర్కిటిక్‌ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో మరణించిన,జైలు శిక్షలు పడిన, దేశ బహిష్కరణకు గురైన రష్యా ప్రతిపక్షనేతల ఉదంతాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. 

పుతిన్‌ తీవ్ర విమర్శకుడిగా పేరొందిన మాజీ డిప్యూటీ సీఎం బొరిస్‌ నెమ్‌సోవ్‌ 2015లో మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనం సమీపంలోని  బ్రిడ్జిపై నడుస్తూ వెళుతుండగా దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ ఎవరన్నది ఇప్పటికీ తెలియలేదు. నెమ్‌సోవ్‌ మంచి వక్త. పుతిన్‌ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు. 

రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైనా వ్లాదిమిర్‌ కరాముర్జా(42)కు 2023 ఏప్రిల్‌లో సుదీర్ఘంగా 23 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్‌, యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను దేశద్రోహం కేసులో విధించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇల్యా యాషిన్‌కు 2022 డిసెంబర్‌లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. తాజాగా జైలులో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యాషెవాకు 2023లో ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. 

పుతిన్‌ను విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఆయిల్‌ రంగంలో వ్యాపార దిగ్గజం మిఖాలీ పదేళ్ల జైలు శిక్ష తర్వాత లండన్‌ వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుతిన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్‌ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్‌ ఏజెంట్లుగా ముద్ర వేశారు. 

ఇదీ చదవండి.. జైలులోనే మృతి చెందిన పుతిన్‌ ప్రత్యర్థి నావల్ని


 

  

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)