పుతిన్ బద్ధశత్రువు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల జైలు శిక్ష

Published on Fri, 08/04/2023 - 21:27

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీకి మరో 19 ఏళ్ల శిక్షను ఖరారు చేస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించారు. ఈ మేరకు విచారణకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. 

వీడియోలో నవాల్నీ నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. చేతులు జోడించుకుని నిలబడి తీర్పును వింటున్నట్లు కనిపించారు. వీడియోలో న్యాయమూర్తి వెలువరించిన తీర్పుకు సంబంధించిన ఆడియో అస్పష్టంగా ఉందని నవాల్నీ అనుచరలు అన్నారు. తీర్పును విని నిర్దారించడం  కష్టంగా ఉందని చెప్పారు. 

రష్యాలో పుతిన్‌కు ఏకైక ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నవాల్నీపై ఉగ్రవాదం సహా పలు కేసులు నమోదు చేశారు. ఇందులో ఆయన ఇప్పటికే 11 ఏళ్లకు పైగా శిక్ష పడగా.. తాజాగా మరికొన్ని అభియోగాల్లో మరో 19 ఏళ్లు కారాగార శిక్ష ఖరారైంది. పుతిన్ తన ప్రత్యర్థిని బయటకు వెళ్లకుండా జైళ్లోనే మగ్గే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని నవాల్నీ అనుచరులు ఆరోపిస్తున్నారు. నవాల్నీ ప్రస్తుతం 47 ఏళ్ల వయసులో ఉన్నారు. కాగా తాజా తీర్పుతో అతని అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది.  

ఇదీ చదవండి: Putin Critic Alexei Navalny: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బద్ధశత్రువుపై మరిన్ని కేసులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)