Breaking News

టాంజానియాలో వివాదాస్పదంగా ఎన్నికలు 

Published on Fri, 10/31/2025 - 01:06

నైరోబి(కెన్యా): టాంజానియాలో ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. గురువారం రెండో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1961 నుంచి అధికారంలో ఉన్న చమా చా మపిండుజి(సీసీఎం) మరోసారి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు నేతల్ని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. 

ఎన్నికల సంస్కరణలకు పిలుపునిచ్చిన ప్రధాన ప్రతిపక్ష నేత టుండు లిస్సును దేశద్రోహం నేరం కింద జైలులో పెట్టారు. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి లుహా ఎంపినాను సైతం అనర్హుడిగా ప్రకటించారు. దీంతో, ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హసన్‌తో ఎన్నికల బరిలో చిన్నాచితకా పార్టీలకు చెందిన 16 మంది పోటీ పడ్డారు. వీరెవరూ ప్రచారం కూడా చేయలేదు. బుధవారం పోలింగ్‌ జరిగింది. 

జనం స్పందన అంతంతమాత్రంగానే ఉంది. నిరసన కారులు ఒక బస్సుకు, గ్యాస్‌ స్టేషన్‌కు నిప్పంటించారు. పలు చోట్ల పోలీస్‌స్టేషన్లపై దాడులకు దిగారు. పోలింగ్‌ స్టేషన్లను ధ్వంసం చేశారు. ఘర్షణల్లో ఒక పౌరుడు, ఒక పోలీసు అధికారి చనిపోయారు. దీంతో, ప్రభుత్వం బుధవారం సాయంత్రం వాణిజ్య రాజధాని దారెస్సలామ్‌లో కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ రాత్రి నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. 

గురువారం ఉద్యోగులను ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. అత్యవసరం కాని సిబ్బంది బయటకు రావద్దని సూచించింది. రహదారులపై ఆర్మీ అడ్డంకులను ఏర్పాటు చేసింది. సరైన పర్మిషన్లు లేని వారిని ఇళ్లకు పంపించి వేసింది. ప్రధాన ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను సైన్యం నిలువరించింది. కెన్యా సరిహద్దులకు సమీపంలో ఉన్న మంగాంగా పట్టణంలో నిరసనలు పెద్ద ఎత్తున జరిగాయి. 

వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారు. వ్యాపార సంస్థలు పనిచేయలేదు. గురువారం వెలువడిన మొట్టమొదటి ఫలితాల్లో 272 నియోజకవర్గాలకు గాను 8 చోట్ల 96.99 శాతం ఓట్లు అధ్యక్షుడు హసన్‌కే పడినట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఈ ఫలితాలపై యూరోపియన్‌ పార్లమెంట్‌ తీవ్రంగా స్పందించింది. ‘టాంజానియాలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు. నిష్పాక్షికమూ కాదు’అంటూ వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం, పౌరుల హక్కుల కోసం గట్టిగా నిలిచి పోరాడాలని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిచ్చింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)