Breaking News

Sunita Williams: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’: వైట్‌హౌస్‌

Published on Wed, 03/19/2025 - 09:41

వాషింగ్టన్‌ డీసీ: తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు(Astronauts) తిరిగి భూమికి చేరుకోవడంపై యునైటెడ్‌ స్టేట్స్‌లోని అధ్యక్షుని అధికారిక కార్యాలయం వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇచ్చారని, దానిని నిలబెట్టుకున్నారని వైట్‌హౌస్‌ పేర్కొంది.

అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా(American space agency NASA)కు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని, వైట్ హౌస్ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఒక వీడియో షేర్‌ చేస్తూ పేర్కొంది. ఈరోజు వారు సురక్షితంగా భూమిపైకి దిగారని, వ్యోమగాములను సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు ఎలోన్ మస్క్, స్పేస్‌ఎక్స్, నాసాకు వైట్‌హౌస్‌ కృతజ్ఞతలు తెలిపింది.
 

డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'(Truth Social)లో వ్యోమగాములు తిరిగి వచ్చిన క్షణాలను షేర్‌ చేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో భూమికి తిరిగి వచ్చారు. ఎనిమిది రోజుల మిషన్‌ కోసం బయలుదేరిన సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఆమె సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు  మిన్నంటాయి. 

ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)