Breaking News

వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహూ భేటీ

Published on Wed, 07/29/2026 - 05:16

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూ మంగళవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక వీరిద్దరూ సమావేశమవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వీరి మధ్య చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని అనంతరం వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కెరొలిన్‌ లీవిట్‌ చెప్పారు. ఇద్దరు నేతలు చర్చించిన అంశాలపై వైట్‌హౌస్‌గానీ, ఇజ్రాయెల్‌ ప్రభుత్వం గానీ స్పందించలేదు. కాగా, ట్రంప్, నెతన్యాహూలకు ఇది కీలక సమావేశం.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత దేశంలో ప్రజాదరణ తగ్గిపోతుండటంపై నెతన్యాహూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రంప్‌ సైతం ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి, తలనొప్పులు తెచ్చుకున్నారు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగనుండగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగించలేక, నిలిపివేసి ఓటమిని అంగీకరించలేక ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడినపడే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)