Breaking News

మయన్మార్‌, బంగ్లాదేశ్‌లని తాకనున్న మోచా తుఫాను..ఇప్పటికే వేలాదిమంది..

Published on Sat, 05/13/2023 - 19:05

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా మోచా తుపానుగా మారింది. తొలుత ఈ తుపాను ప్రభావం ఏపీ, ఒడిశా రాష్ట్రాలపై ఉంటుందని భావించారు అధికారులు. కానీ తుపానుగా మారిన తర్వాత తన దిశ మార్చుకుని ఈశాన్య రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను మే 14న బంగ్లాదేశ్‌, మయాన్మార్‌ సరిహద్దుల్లో తీరం దాటనుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ మోచా తుపాను గంటకు హరికేన్‌ 4కి సమానంగా సుమారు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు

ఈ తుపాను మయాన్మార్‌ రఖైన్‌ తీరంలోని సిట్వే మధ్య ఆదివారం ఉదయం తాకగానే బలహీనపడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఒక లక్ష మందికిపైగా ప్రజలు ఉన్న పట్టణంలో దుకాణాలు, మార్కెట్‌లు మూసేశారు. ఇదిలా ఉండగా, మయన్మార్ జుంటా అధికారులు రఖైన్ తీరం వెంబడి ఉన్న గ్రామాలలో తరలింపు ప్రక్రియలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మయన్మార్ ఎయిర్‌వేస్ ఇంటర్నేషనల్ రాఖైన్ ఎయిర్‌పోర్టు తమ రాష్ట్రానికి వచ్చే అన్ని విమానాలను సోమవారం వరకు నిలిపివేసినట్లు తెలిపింది.

అలాగే పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అధికారులు రోహింగ్యా శరణార్థులను ప్రమాదకర ప్రాంతాల నుంచి కమ్యూనిటీ కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సిద్ర్‌ తుపాను తర్వాత మోచా తుపాను అత్యంత శక్తిమంతమైన తుపాన్‌ అని బంగ్లాదేశ్‌ వాతావరణ విభాగం అధిపతి రెహ్మన్ వెల్లడించారు. ఈపాటికే వేలాది మంది వాలంటీర్లు రోహింగ్యాలను ప్రమాదకర ప్రాంతాల నుంచి పాఠశాలలు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆయా సరిహద్దులోని దీవుల్లో పనిచేసే వేలాదిమంది ఆయా ప్రాంతాలను విడిచి పారిపోయినట్లు కూడాఅధికారులు పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఓడరేవు చిట్టగాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయడమే గాక పడవ రవాణా, చేపల వేటను కూడా నిషేధించారు అధికారులు.

(చదవండి: క్షణాల్లో కాల్చివేత, అమెరికాలో సంచలనం.. దడ పుట్టిస్తున్న వీడియో)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)