జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Published on Mon, 04/20/2026 - 14:30

టోక్యో: జపాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం జపాన్ ఈశాన్య తీరానికి సమీపంగా ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. రవాణా సేవలకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లాలని కోరారు.

జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీట‍ర్ల లోతులో సంభవించింది. ఇవాటే, ఆఓమోరి, హొక్కైడో ప్రిఫెక్చర్ ప్రాంతాల తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా 3 మీటర్ల ఎత్తుకి సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ప్రధాన మంత్రి సనఏ తకైచి అత్యవసర సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

కొనసాగుతున్న నౌకల తరలింపు
జపాన్‌లోని ఉత్తర తోహోకు ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య రేవు ‘హచినోహే పోర్ట్’ నుంచి నౌకలు వెంటనే తరలిపోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలలు త్వరలో తీరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టోక్యో నుంచి ఆఓమోరి వరకు బుల్లెట్ రైలు సేవలను భూకంపం తర్వాత నిలిపివేశారు. 

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)