Breaking News

అందమంటే భారత మహిళలదే.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు!

Published on Sun, 03/12/2023 - 09:51

ప్రపంచంలో 200కుపైగా దేశాలు ఉన్నాయి. ఏటా ప్రపంచ సుందరి, విశ్వ సుందరి పోటీల్లో ఏదో ఓ దేశానికి చెందిన, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు. ఇలా ఒకరిద్దరి అందం గురించి కాకుండా.. సగటున అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ నివేదిక చెబుతోంది. ఈ అంశంపై యూకేకు చెందిన మల్టీనేషనల్‌ వస్త్రాల కంపెనీ ‘పోర్‌ మోయి’ ఆన్‌లైన్‌లో అధ్యయనం చేసి తాజాగా నివేదిక విడుదల చేసింది. 

పోస్టులు, ప్రశంసలను విశ్లేషించి.. 
ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘రెడ్డిట్‌’లో గత ఏడాది మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను ‘పోర్‌ మోయి’సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా విశ్లేషించింది. వివిధ దేశాలకు చెందిన మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని ‘అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్‌సమ్, ప్రెట్టీ, గుడ్‌ లుకింగ్, గార్జియస్, ప్రెట్టీ..’వంటి కామెంట్లను.. ఆ పోస్టులు, చిత్రాలకు వచ్చిన అప్‌వోట్‌లను (ఫేస్‌బుక్‌లో లైక్‌ల తరహా ఇచ్చేవి) పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆయా దేశాల వారికి ర్యాంకులను ఇచ్చింది. కృత్రిమ మేధ ఇమేజ్‌ జనరేషన్‌ టూల్‌ ‘మిడ్‌జర్నీ’సాయంతో ఆయా దేశాల వారి రూపురేఖలపై రూపొందించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. 

భారత మహిళలే టాప్‌.. 
‘పోర్‌ మోయి’స్టడీలో అత్యంత అందమైన మహిళలుగా భారతీయులే నిలిచారు. జపాన్, స్వీడన్‌ మహిళలు రెండు, మూడో స్థానం సాధించగా.. వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఎస్‌ఏ వారు ఉన్నారు. ఓవరాల్‌గా మహిళలు, పురుషులు కలిపి చూస్తే కూడా.. భారతీయులే టాప్‌లో 
ఉండటం గమనార్హం. 

- అదే పురుషుల కేటగిరీలో చూస్తే.. బ్రిటన్లు టాప్‌లో ఉండగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఇటలీ, యూఎస్‌ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, 
బెల్జియం, బ్రెజిల్‌ వారు ఉన్నారు.   

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)