Breaking News

 దైవం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి 

Published on Sat, 05/10/2025 - 04:48

వాటికన్‌ సిటీ: కొత్తగా ఎన్నికైన పోప్‌ లియో 14 తన మొదటి ప్రార్థనను నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో దైవం పట్ల విశ్వాసాన్ని కలిగించాలని, విశ్వాసం లేకపోవడాన్ని తీవ్రంగా ఎదుర్కోవాలని కాథలిక్‌ చర్చికి పిలుపునిచ్చారు. చర్చిలు ఈ ప్రపంచంలోని చీకటి రాత్రులను ప్రకాశవంతం చేసే దీపస్తంభాలని, నిర్వహణలో విశ్వసనీయంగా ఉంటానని చెప్పారు. 267వ పోప్‌గా ఎన్నికైన మరుసటి రోజు ఆయన కార్డిన్సల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. 

ప్రజలు విశ్వాసానికి దూరమై, సాంకేతికత, డబ్బు, విజయం, అధికారం, ఆనందం వైపు మొగ్గచూపుతున్న ఈ సమయంలో విశ్వాసాన్ని అసంబద్ధంగా భావించే ప్రమాదముందని హెచ్చరించారు. ఇందుకు ప్రచారం అవసరమని గుర్తు చేశారు. ‘విశ్వాసం లేకపోవడమంటే జీవితం అర్థాన్ని కోల్పోవడం, దయను విస్మరించడం, మానవ గౌరవాన్ని ఉల్లంఘించడం, కుటుంబ సంక్షోభమని.. ఇది సమాజానికి చెడు గాయాలను చేస్తుందని ఇటాలియన్‌లో ప్రసంగించారు. 69 ఏళ్ల పోప్‌ లియో బంగారంతో అలంకరించిన తెల్లటి పాపల్‌ వ్రస్తాన్ని ధరించి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వాటికన్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 

మే 18న అధికారిక ప్రమాణ స్వీకారం 
నూతన పోప్‌ లియో14 మే 18న అధికారికంగా పోప్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో మొదటి బహిరంగ ప్రార్థన నిర్వహిస్తారు. ఆ తరువాత మొదటి సాధారణ సమావేశం మే 21న జరగనుంది. అయితే.. పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణంతో సాంకేతికంగా ఉద్యోగాలు కోల్పోయిన వాటికన్‌ సంస్థల అధిపతులు, సభ్యులందరూ తదుపరి నోటీసు వచ్చేవరకు పదవిలో ఉండాలని లియో కోరారు.  

పోప్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ 
పోప్‌ లియో 14కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘పోప్‌ లియో 14కు భారత ప్రజల నుంచి హృదయపూర్వక అభినందనలు. శుభాకాంక్షలు. శాంతి, సామరస్యం, సంఘీభావం, సేవ ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో కాథలిక్‌ చర్చి నాయకత్వం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. మన భాగస్వామ్య విలువలను పెంపొందించడానికి హోలీ సీతో నిరంతర చర్చలకు భారతదేశం కట్టుబడి ఉంది’’అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.  

పోప్‌కు రాహుల్‌గాంధీ అభినందనలు  
2వేల ఏళ్ల చరిత్ర కలిగిన కాథలిక్‌ చర్చికి మొట్టమొదటి అమెరికన్‌ పోప్‌గా ఎన్నికైన కార్డినల్‌ రాబర్ట్‌ ప్రెవోస్ట్‌ను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శుక్రవారం అభినందించారు. ‘పోప్‌ లియో 14కు అభినందనలు. ఆయన నాయకత్వంలో శాంతిని, కరుణను, మానవాళికి సేవను పెంపొందించాలి. ఈ సంతోషకరమైన సందర్భంలో ప్రపంచ కాథలిక్‌ కమ్యూనిటీకి నా శుభాకాంక్షలు’’అని రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు