Breaking News

Canada: కెనడాలో ‘ట్రూడో’కు షాక్‌.. సర్వేల్లో సంచలన ఫలితాలు

Published on Sun, 03/10/2024 - 13:36

ఒట్టావా: కెనడాలో ప్రధాని జస్టిన్‌ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పోస్ట్‌ మీడియా కోసం ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో 70 శాతం మంది ట్రూడో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది.  దేశంలో పాలన సరిగా లేదని 60 శాతం మంది ట్రూడో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో 43 శాతం మంది 2021 ఎన్నికల్లో ట్రూడో ప్రభుత్వానికి ఓటు వేసిన వారే కావడం గమనార్హం.

దేశంలో పెరగిపోతున్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతున్న జీవన ఖర్చు, ఆరోగ్య రంగం, ప్రజల ఇళ్లు కొనుగోలుచేసే శక్తి వంటి అంశాల వచ్చే ఏడాది (2025) జరిగే సాధారణ ఎన్నికల్లో ట్రూడోకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు చెబుతున్నారు. కాగా, నాన్‌ ప్రాఫిట్‌ అంగుస్‌ రెడ్‌ సంస్థ(ఏఆర్‌ఐ) నిర్వహించిన సర్వేలోనూ కేవలం 17 శాతం మంది మాత్రమే ట్రూడో తిరిగి ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు. 28 శాతం మంది ‘నన్‌ ఆఫ్‌ ద అబోవ్‌’ ఆప్షన్‌ను ఎంచుకున్నారు.

ఈ సర్వేలో కన్జర్వేటివ్‌ నేత పియెర్రే పొలీవర్‌ పట్ల మాత్రం కాస్త మెరుగైన స్పందన వచ్చింది. లిబరల్స్‌తో పోల్చుకుంటే కన్జర్వేటివ్‌ పార్టీ గత 12 నెలల నుంచి దేశంలో నిర్వహించిన సర్వేల్లో ముందు నిలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 338 సీట్లున్న కెనడా పార్లమెంట్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ 206 సీట్లు, లిబరల్స్‌ 67 సీట్లు గెలుచుకుంటాయని అంచనాలున్నాయి.

ఇదీ చదవండి.. వయసుపై జోకులు వేసుకున్న  బైడెన్‌.. పాపులర్‌గా మారిన యాడ్‌ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)