Breaking News

బైడెన్‌ కంటే కమలా హారీస్‌ బెటర్‌.. పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

Published on Wed, 07/03/2024 - 10:29

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహార శైలే కారణమని పలువురు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారీస్‌ను బరిలో దింపాలని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక పలు సర్వేల పోల్స్‌ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో, అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది.

కాగా, తాజాగా సీఎన్‌ఎన్‌ పోల్‌ ప్రకారం.. నమోదైన ఓటర్లలో ట్రంప్‌నకు 47 శాతం ఓట్లు రాగా.. కమలా హరీస్‌కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారీస్‌ 50 శాతం ఓట్లు రావడం విశేషం. ఇదే సమయంలో బైడెన్‌కు 44 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు.. మిచెల్లీ ఒబామాకు 37 శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో బైడెన్‌ డిబెట్‌ గురించే ప్రధానంగా చర్య జరుగుతోంది. ట్రంప్‌ను ఢీకొనడంతో బైడెన్‌ విఫలమయ్యారనే డెమోక్రటిక్‌ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో, ఆయన పోటీలో ఉంటారా? అనే చర్య మొదలైంది. మరోవైపు.. ట్రంప్‌తో డిబెట్‌ సందర్భంగా తాను ఎందుకు సరిగా మాట్లాడలేదో క్లారిటీ ఇచ్చారు. ఈ తడబాటుకు గల కారణాన్ని బైడెన్‌ చెప్పుకొచ్చారు.

వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన..‘తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. ఈ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబెట్‌లో ట్రంప్‌తో సరిగా వాదించలేకపోయానన్నారు. చర్చలో తాను మరింత ధాటిగా మాట్లాడి ఉంటే బాగుండేదని చెప్పారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించవద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)