Breaking News

ఫ్రాన్స్‌లో అల్లకల్లోలం 

Published on Mon, 10/19/2026 - 06:01

పారిస్‌: నిరసనలు, విధ్వంసం, హింసాకాండతో ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. జీవన వ్యయం విపరీతంగా పెరగడం, పాఠశాలల్లో కనీస వసతుల లేమి, నిధుల కోతపై మొదలైన ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల ముసుగుల్లో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దుండగులు గుంపులుగా తిరుగుతూ దుకాణాలను లూటీ చేస్తున్నారు. పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు. 

ఇప్పటిదాకా 1,800 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముసుగులు ధరించిన గుంపులు పలు నగరాల్లో చారిత్రక కట్టడాలకు నిప్పుపెట్టాయి. నగర పాలక భవనాలతో సహా ప్రభుత్వ భవనాలపై దాడి చేశాయి. సెంట్రల్‌ ఫ్రాన్స్‌లోని లిమోజెస్‌ నగరంలో 19వ శతాబ్దపు నాటి చారిత్రక సిటీ హాల్‌ను మంటలు చుట్టుముట్టడంతో పైకప్పు కూలిపోయింది. ఈ భవనం చాలావరకు దహనమైంది. ఆదివారం నాటికి మంటలు అదుపులోకి వచ్చాయని అన్నారు.

 ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆదివారం ప్రభుత్వ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. అల్లరి మూకలను కఠినంగా అణచివేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. రాజధాని పారిస్‌తోపాటు మార్సెయిల్, లియోన్, బోర్డో, రెన్నెస్, స్ట్రాస్‌బర్గ్, గ్రెనోబుల్, నైస్, లిమోజెస్‌ నగరాల్లో వందలాది వ్యాపార సంస్థల్లో  దోపిడీ జరిగింది. ఖరీదైన వస్త్రాలతోపాటు వస్తువులను పట్టపగలే దుండగులు దోచుకున్నారు. దేశంలో 8 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఓ అంచనా.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)