Bangladesh: వర్శిటీ అధికారులతో పీఎం హసీనా భేటీ

Published on Sun, 08/04/2024 - 09:25

బంగ్లాదేశ్‌లో విద్యార్థుల రిజర్వేషన్‌ ఆందోళలను అదుపుచేసేందుకు ఆ దేశ ప్రధానిషేక్ హసీనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, కాలేజీ ప్రిన్సిపాళ్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అయితే విద్యార్థి ఉద్యమ నాయకులు ఈ చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించారు. పీఎం హసీనా వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం రిజర్వ్ చేసే కోటా వ్యవస్థను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో ఇటీవల పోలీసులు- విద్యార్థి నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలను చోటుచేసుకున్నాయి. వీటిని అదుపు చేసేందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, సీనియర్ అధ్యాపకులు, కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రధాని సమావేశమయ్యారని పీఎంవో ప్రతినిధి తెలిపారు. శనివారం రాత్రి 8:15 గంటలకు ప్రారంభమైన సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది.

దీనిముందు పీఎం హసీనా వివిధ విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడుతూ ఈ విషయంలో చర్చల కోసం ఎవరైనా తన వద్దకు రావచ్చని, విద్యార్థులు తమ తల్లిండ్రులను కూడా తీసుకుని రావచ్చన్నారు. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే ఆలోచన తమకు లేదని విద్యార్థి ఉద్యమ నేతలు మీడియాకు తెలిపారు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)