Breaking News

ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

Published on Thu, 07/03/2025 - 04:48

ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్‌ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్‌–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. 

ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. గ్లోబల్‌ సౌత్‌లో భారత్‌కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్‌ అండ్‌ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్‌లో 17వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు.  
 

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు