Breaking News

మొట్టమొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్సులో నరేంద్ర మోదీ?

Published on Thu, 06/22/2023 - 12:04

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్ లో జరిగే యూఎస్ ప్రెస్ కాన్ఫెరెన్స్ లో ఆయన పాల్గొంటారని, అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో రెండే రెండు ప్రశ్నలుంటాయని ఈ ఫార్మాట్ గురించి వివరించారు వైట్ హౌస్ జాతీయ భద్రతాధికారి జాన్ కిర్బీ.

భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలలో మాట్లాడటం తప్పిస్తే ఎన్నడూ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొంది లేదు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న ఆయన చివర్లో మాత్రం ప్రెస్  కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని ఆ ఫార్మాట్లో కూడా కేవలం రెండే ప్రశ్నలుంటాయని తెలిపారు వైట్ హౌస్ భద్రతాధికారి జాన్ కిర్బీ. 

 "బిగ్ డీల్"
దీన్ని "బిగ్ డీల్" గా వర్ణిస్తూ.. భారత్ ప్రధాని ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం సంతోషకరం. ప్రస్తుతం ఇది రెండు దేశాలకు చాలా అవసరమైనదని, మోదీ కూడా ఇది అవసరమని చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్సులో రెండే రెండు ప్రశ్నలుంటాయని.. ఒక ప్రశ్న యూఎస్ ప్రెస్ వారు అడిగితే రెండవది భారత జర్నలిస్టు అడుగుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ రెండు ప్రశ్నల "బిగ్ డీల్" ఇప్పుడు అమెరికా మీడియాలో సంచలనంగా మారింది. 

ఇవి కూడా అడగండి.. 
ఇదిలా ఉండగా అమెరికా సెనేటర్లు మాత్రం భారత ప్రధానిని దేశంలోని రాజకీయ అనిశ్చితి గురించి, మత విద్వేషాల గురించి, పౌర సంస్థలపైన, విలేఖరులపైన జరుగుతున్న దాడుల గురించి, పత్రికా స్వేచ్ఛ, అంతర్జాల వినియోగంపై పరిధులు విధించడం వంటి అనేక విషయాల గురించి ప్రశ్నించమని కోరుతూ అధ్యక్షుడు జో బైడెన్ పై ఒత్తిడి  చేస్తున్నారు. అయినా కూడా వైట్ హౌస్ వర్గాలు ప్రెస్ కాన్ఫరెన్సును రెండే ప్రశ్నలకు పరిమితం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు సెనేటర్లు.  

ఇది కూడా చదవండి: ఇది "సాంకేతిక దశాబ్దం".. అమెరికా పర్యటనలో భారత ప్రధాని 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)