Breaking News

ఉక్రెయిన్‌లో శాంతికి సహకారం

Published on Fri, 08/23/2024 - 04:30

వార్సా: ఏ సమస్యకైనా సరే యుద్ధక్షేత్రంలో పరిష్కారం దొరకదని తాము బలంగా నమ్ముతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సంఘర్షణలు, వివాదాలను శాంతియుతంగా దౌత్యమార్గాల్లో పరిష్కరించుకోవడమే ఉత్తమమైన విధానమని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో స్థిరత్వం, శాంతిని పునరుద్ధరించడానికి తాము చేయగలిగే పూర్తిసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ రెండో రోజు గురువారం పోలండ్‌ ప్రధానమంత్రి డొనాల్డ్‌ టస్‌్కతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. 

భారత్‌–పోలండ్‌ మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఒకదేశానికి చెందిన నైపుణ్యం కలిగిన కారి్మకులు మరో దేశంలో సులువుగా ఉద్యోగాలు పొందడానికి వీలు కలి్పంచే సామాజిక భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనాలు, ఫార్మాస్యూటికల్స్, పట్టణ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, కృత్రిమ మేధ(ఏఐ), అంతరిక్షం తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. డొనాల్డ్‌ టస్‌్కతో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో చర్చించిన కీలక  అంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాలపై ఆందోళన వ్యక్తంచేశారు.  

ఆ సంస్థలను సంస్కరించాలి
భారత్‌–పోలండ్‌ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండుతున్నాయని, ఈ సందర్భంగా ఇరు దేశాల నడుమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. సామాజిక భద్రతా ఒప్పందంతో నైపుణ్యం కలిగిన కారి్మకులకు, ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వారి సంక్షేమం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్‌–రష్యా ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థులను క్షేమంగా వెనక్కి రప్పించడానికి సహకరించినందుకు పోలండ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై పోలండ్‌ సైతం తనతో ఏకీభవించిందని తెలిపారు.

భారత్‌కు అభినందనలు: డొనాల్డ్‌ టస్క్‌  
ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్న యుద్ధాలపై మోదీ, తాను చర్చించామని టస్క్‌ వివరించారు. వాటిపై స్పష్టతకు వచ్చామన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పేందుకు వ్యక్తిగతంగా కృషి చేయడానికి మోదీ సంసిద్ధత వ్యక్తం చేయడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. భారత్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)