Breaking News

అక్కడ ఏడాదికి 21 గంటలే

Published on Thu, 11/28/2024 - 04:14

అనగనగా అదో గ్రహం. నెఫ్ట్యూన్‌ సైజులో ఉంటుంది. దానిపై ఒక ఏడాదిలో కేవలం 21 గంటలే ఉంటాయి!  అది మాతృ నక్షత్రానికి అతి సమీపంగా ఉండటమే ఇందుకు కారణమట. దాంతో నక్షత్రం చుట్టూ ఆ గ్రహం పరిభ్రమణం కేవలం 21 గంటల్లో పూర్తయిపోతోందని సైంటిస్టులు కనిపెట్టారు. టీఓఐ–3261గా పిలిచే ఈ గ్రహం, దాని తాలూకు నక్షత్రమండలం వయసు 650 కోట్ల ఏళ్లని అంచనా. 

తొలుత బృహస్పతి పరిమాణంలో ఉన్న ఈ గ్రహం నిరంతరం ద్రవ్యరాశిని కోల్పోతూ చిన్నదవుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. దాని మాతృనక్షత్రపు ఆకర్షణ శక్తే ఇందుకు ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిమాణంలో నెఫ్ట్యూన్‌కు సమానంగా ఉన్నా ద్రవ్యరాశి మాత్రం దానితో పోలిస్తే రెట్టింపుగా ఉందట! టీఓఐ–3261 ఉనికి గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన ప్రస్తుత సిద్ధాంతాలన్నింటినీ సవాలు చేస్తుండటం విశేషం. 

ఎందుకంటే మాతృ నక్షత్రానికి అంత దగ్గరగా ఉండే గ్రహాలపై దట్టమైన వాయువులతో కూడిన వాతావరణం నిలిచి ఉండటం దాదాపుగా అసాధ్యమన్నది శాస్త్ర ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న భావన. దాంతో గ్రహాల పుట్టుకకు సంబంధించి మనకు తెలియని కొత్త కోణాలకు టీఓఐ–3261 దారి చూపుతుందని భావిస్తున్నారు. అందుకే దానిపై వాతావరణాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాలూకు పరారుణ కాంతి టెక్నాలజీ సాయంతో లోతుగా పరిశోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త ఎమ్మా నబ్బీ ఆధ్వర్యంలోని సైంటిస్టుల బృందం అధ్యయనంలో వెల్లడైన ఈ విశేషాలను ఆస్ట్రానామికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.     
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)