Breaking News

గాలిలో మృత్యు ప్రయాణం

Published on Wed, 12/25/2024 - 13:08

మాస్కో:  విమాన ప్రయాణం తీవ్ర విషాదం మిగిల్చింది. విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో మంటలు చెలరేగి దాదాపు 38 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కజకిస్తాన్‌లోని అక్తావ్‌ నగర సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జే2–8243 విమానం 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో రష్యాకు బయలుదేరగా మధ్యలో ప్రమాదం సంభవించింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకూ సిటీ నుంచి రష్యాలోని నార్త్‌ కాకస్‌ ఉన్న గ్రాజ్నీ నగరానికి బయలుదేరింది. అయితే, గ్రాజీ్నలో పొగమంచు కారణంగా ల్యాండింగ్‌ చేసే పరిస్థితి లేకపోవడంతో విమానాన్ని దారి మళ్లించారు. 

అక్తావ్‌ నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మైదానంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేసేందుకు ప్రయతి్నంచారు. అదుపు తప్పిన విమానం కూలిపోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయడానికి ఎయిర్‌పోర్టు అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెంటనే అనుమతి రాకపోవడంతో విమానం ఆకాశంలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. చివరకు అదుపుతప్పి నేలపైకి దూసుకొచి్చంది. ప్రమాదాన్ని నివారించడానికి పైలట్లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.  

కొందరి పరిస్థితి విషమం  
ప్రమాదానికి గురైన విమానంలో 42 మంది అజర్‌బైజాన్‌ పౌరులు, 16 మంది రష్యా జాతీయులు, ఆరుగురు కజకిస్తాన్‌ పౌరులు, ముగ్గురు కిర్గిజిస్తాన్‌ పౌరులు ఉన్నట్లు కజకిస్తాన్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 29 మంది ప్రాణాలతో బయటపడ్డారని, వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారని కజకిస్తాన్‌ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సహాయక చర్యలు కొనసాగు­తున్నాయని పేర్కొంది. కానీ, ఇద్దరు పైలట్లు కూడా మరణించారని రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్‌ వెల్లడించింది. కనీసం 32 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అజర్‌బైజాన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం స్పష్టంచేసింది. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అజర్‌బైజాన్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వివరించింది.

పక్షి ఢీకొట్టడం వల్లే ప్రమాదం?
ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న కథనా­లు వినిపిస్తున్నాయి. రష్యా వైపు విమానం ప్రయాణిస్తుండగా హఠాత్తుగా పక్షి ఢీకొట్టిందని, దాంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమయ్యారని, విమానాన్ని దారిమళ్లించడానికి ప్రయతి్నంచారని, కొద్దిసేపు తర్జనభర్జన తర్వాత అక్తావ్‌ వైపు మళ్లించారని రష్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించి మొబైల్‌ ఫోన్‌ ఫుటేజీ సైతం సోషల్‌ మీడియాలో ప్రసారమైంది. విమానం నిట్టనిలువుగా కిందికి దూసుకొస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. అది భూమిని తాకిన వెంటనే మంటలు చెలరేగాయి. 

విమాన ప్రధాన భా­గం నుంచి రెక్కలు విడిపోయాయి. ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తమ సహచరులను విమాన శిథిలాలనుంచి బయటకు లాగుతున్న దృ­శ్యాలు కనిపించాయి. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అజర్‌బైజాన్‌ అధికారులు ఘటనా స్థలా­నికి బయలుదేరారు. రష్యా పర్యటనలో ఉన్న అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలీయేవ్‌ స్వదేశానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాల­ని ఆకాంక్షించారు. అజర్‌బైజాన్‌ విమాన ప్రమాదం­పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ది్రగ్బాంతి వ్యక్తంచేశా­రు. అలీయేవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వివరా­లు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక విమానంలో వైద్య సిబ్బందిని, సహాయక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించామని పుతిన్‌ చెప్పారు.
 

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)