Breaking News

ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి

Published on Wed, 01/29/2025 - 19:03

జుబా: సౌత్‌ సూడాన్‌లో (south sudan) ఘోర విమాన (plane crash) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు.

యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్‌ పయనీర్‌ ఆపరేటింగ్‌ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్‌వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది.

ప్రమాదంతో చమురు క్షేత్రాల సమీపంలో విమాన శకలాలు తలక్రిందులుగా పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న విమాన శిధిలాలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.   

ప్రమాదంపై సౌత్‌ సూడాన్‌ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్‌వెచ్ బిపాల్ బోత్ స్పందించారు. విమానం ప్రమాదంలో 20 మంది మరణించారని, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. స్థానిక అధికారుల వివరాల మేరకు.. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్‌ సూడాన్‌, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.

 

ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సౌత్‌ సూడాన్‌ 2011లో స్వాతంత్ర్యం పొందించింది. నాటి నుంచి దక్షిణ సూడాన్ పేలవమైన రవాణా కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదాలు సర్వసాధారణమని సమాచారం. 

👉చదవండి: నల్లపెట్టె మౌనరాగం! 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)