అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ప్రయాణికుడి ఓవరాక్షన్.. ఈడ్చి పడేసిన పైలట్
Published on Sat, 01/07/2023 - 14:00
వైరల్: విమానంలో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించడం, వికృత చేష్టలకు పాల్పడుతున్న నానాటికీ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజా ఎయిర్ ఇండియా ఘటనలు మాత్రమే కాదు.. ప్రపంచంలో దాదాపు ప్రతీ మూలా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో అలాంటి ప్రయాణికుల పట్ల వాళ్ల కఠినంగా వ్యవహరించాలని భారత విమానయాన నియంత్రణ విభాగం డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ‘వర్జిన్ ఆస్ట్రేలియా’ విమానంలో జరిగిన ఘటన వైరల్గా మారింది.
బుధవారం టౌన్స్విల్లే-సిడ్నీ విమానం టౌన్స్విల్లే నుంచి టేకాఫ్ అయ్యాక.. ఓ ప్యాసింజర్ ఎందుకనో సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో పైలట్ జోక్యం చేసుకోగా.. ఆ వ్యక్తి పైలట్ను సైతం తులనాడాడు. కాలర్ పట్టుకుని అడ్డమైన బూతులు తిట్టాడు. దీంతో.. పైలట్కు చిర్రెత్తుకొచ్చింది. నడువు.. అంటూ అతన్ని ఈడ్చుకుంటూ ఎగ్జిట్ డోర్ దాకా తీసుకెళ్లాడు. ఆపై పోలీసులకు సమాచారం అందించాలని సిబ్బందికి పైలట్ సూచించడంతో ఆ వ్యక్తి గమ్మున అక్కడి నుంచి జారుకున్నాడు. ప్రయాణికుడు అలా గొడవ ఎందుకు పడ్డాడన్నది తెలియరాలేదు. అలాగే అతనిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్నది వర్జిన్ ఆస్ట్రేలియా సైతం ప్రకటించలేదు.
An unruly passenger was kicked out from the aircraft by Virgin Australia's pilot on flight between Townsville to Sydney.
🎥 ©Ben Mckay/TikTok#VirginAustralia #Australia #aviation #AvGeek #avgeeks #flights #Travel #traveler #pilotlife #pilot pic.twitter.com/vBtbmV7tKe
— FlightMode (@FlightModeblog) January 5, 2023
Tags : 1