Breaking News

యూఎస్‌ పట్టభద్రుల్లో హిందువులే ఎక్కువ

Published on Mon, 02/23/2026 - 04:26

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, పట్టభద్రులు ఏ మతస్థులో తెలుసా? అందరూ అనుకుంటున్నట్లు క్రైస్తవులు కాదు. హిందువులే అగ్రస్థానంలో ఉన్నారు. వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తాజాగా ఈ విషయం వెల్లడించింది. 

నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు ఏ మతానికి చెందిన వారన్న దానిపై 2023–24 రిలీజియస్‌ ల్యాండ్‌స్కేప్‌ స్టడీ (ఆర్‌ఎల్‌ఎస్‌) పేరిట ఈ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉన్నత విద్యావంతుల్లో అగ్రస్థానంలో హిందువులు, ఆ తర్వాతి స్థానంలో యూదులున్నట్లు తన నివేదికలో పేర్కొంది. 

→ అమెరికాలో ప్రతి 10 మంది హిందువుల్లో కనీసం ఏడుగురు బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించారు. అంటే 70 శాతం శాతం మంది ఉన్నత విద్యావంతులే. యూదుల్లో ఈ సంఖ్య 65 శాతం. 

→ స్థానిక అమెరికన్లలో కేవలం 35 శాతం మంది ఉన్నత విద్య అభ్యసించారు. 

→ ఇతర మతస్థులు సగటు కంటే కొద్దిగా పైస్థానంలో నిలిచారు. వీరిలో ముస్లింలు, బౌద్ధులు, ఆర్థోడాక్స్‌ క్రైస్తవులున్నారు. ఆయా మతస్థుల్లో ప్రతి పది మందిలో కనీసం 

నలుగురు బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తిచేశారు. ప్రొటెస్టంట్‌ క్రైస్తవులు కూడా ఈ జాబితాలో నిలిచారు. 

→ ఎవెలాంజికల్‌ ప్రొటెస్టంట్లు, క్యాథలిక్స్‌ సగటు కంటే దిగువ స్థాయిలో ఉన్నారు. వీరు చాలావరకు నల్లజాతివారే.  

→ మొత్తం స్థానిక అమెరికా జనాభాలో పరిశీలిస్తే ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే బ్యాచిలర్స్‌ డిగ్రీ అభ్యసించారు. 

→ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం విషయంలో మతాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

→ వలసలు, తద్వారా స్థానిక జనాభా స్థితిగతుల్లో మార్పులు రావడమే ఈ వ్యత్యాసాలకు కారణమని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ తమ నివేదికలో అభిప్రాయపడింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు చాలావరకు ఇతర దేశాల అమెరికాకు వలసవచి్చనవారే కావడం గమనార్హం. వీరు ఉన్నత విద్య లేదా ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం వచ్చారు.  

→ అమెరికాలో ఉద్యోగాల కోసం భారతీయులు అధికంగా తరలివస్తున్నారు. ఇందుకు హెచ్‌–1బీ వీసాలు వారికి తోడ్పడుతున్నాయి. ఈ వీసాలో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారతీయులే కావడం గమనార్హం.  అమెరికాలో టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలను భారతీయులు ప్రభావితం చేస్తున్నారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)