Breaking News

సముద్రంలో సరదాగా సొరతో ఫుట్‌బాల్ ఏజెంట్‌ కొట్లాట.. వీడియో వైరల్..

Published on Mon, 06/26/2023 - 21:25

ఎవరైనా సరదాకి చిన్న జంతువులతో ఆటలాడుతారు. ఇంట్లో ఉండే కుక్క, పిల్లులతోనే కాలక్షేపం చేస్తారు. కొన్నిసార్లు వాటితో సరదాగా పోట్లాడుతారు. ఏవో నవ్వుకునే పనులు చేస్తుంటారు. కానీ ఎవరైనా ప్రమాదకరమైన జంతువులతో పెట్టుకుంటారా? తెలివి ఉన్నవారు ఎవరూ అలా చేయరు కదా..! కానీ ఓ ఫుట్‌బాల్ ఏజెంట్‌ ఏకంగా సొరచేపతో సరదాగా ఫైట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ ‍అయింది.

అమెరికాకి చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్‌ఎఫ్‌ఎల్‌) ఏజెంట్ డ్రూ రోసెన్‌హాస్ సొరచేపతో ఫైటింగ్ చేశారు. స్నేహితులతో సరదాగా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రోసెన్‌హాస్‌.. ఓ చిన్న సొరచేపను చూశారు. అది వారి బోటుకు దగ్గరికి రావడంతో వారంతా మరింత ఆసక్తిని కనబరిచారు. కాసేపు బోటులో నుంచే దానితో ఆటలాడారు. కానీ రోసెన్‌హాస్ మాత్రం సముద్రంలోకి దూకి సొరచేపతో ఆటలాడారు. దాని తోకను పట్టుకుని కాసేపు ఫైటింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సొరతో 45 నిమిషాలు పోట్లాడినట్లు చెప్పుకొచ్చారు.

ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట తెగ వైరల్‌ అయింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్స్‌ బాక్స్ నిండిపోయింది. రోసెన్‌హాస్ తీరుపై పీపుల్ ఫర్‌ ద ఎథికల్ ట్రీట్‌మెంట్‌ ఆఫ్ ఎనిమల్స్‌(పీఈటీఏ) మండిపడింది. జంతువులతో అలా ప్రవర్తించడంపై ఆక్షేపించింది. సొరచేపతో అటలాడటాన్ని కొందరు విమర్శించారు. కాలుష్యంతో ఇప్పటికే సముద్ర జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయ్.. ఇక నేరుగా కూడా దాడి చేస్తారా? అంటూ కామెంట్లు పెట్టారు.  

ఇదీ చదవండి: ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన తల్లి.. కొన్నాళ్ల తర్వాత

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)