అదే ఆరోగ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌.. 15 వేలమందిపై సర్వే.. ఆసక్తికర వివరాలు వెల్లడి!

Published on Mon, 05/29/2023 - 08:25

మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెబుతారు. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదే ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనల నేపధ్యంలోనే చాలామంది ప్రకృతితో మమేకమై జీవించాలనుకుంటారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిపారు. సముద్రతీరంలో నివసించేవారు అరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు.

‘కమ్యూనికేషన్‌ అర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్‌ వియానాకు చెందిన ఎన్విరాన్‌మెంటల్‌ సైకాలజీ గ్రూప్‌ చేపట్టింది. ఈ బృందానికి సాండ్రా జోయిగర్‌ సారధ్యం వహించారు. సముద్రతీరం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే మనుషులు సాగరతీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చాలా దేశాలు సముద్రతీరం వెంబడి ఉన్నాయని, సాగరతీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలినవారికన్నా ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలిందన్నారు.

పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజీషియన్లు తమ దగ్గరకు వచ్చేవారికి సముద్ర స్నానం చేయాలని, సముద్రతీరంలో నడవాలని సూచించేవారు. ఈ దిశగా ‍ప్రోత్సహించేవారు. అలాగే 19వ శతాబ్ధపు మధ్యభాగంలో యూరప్‌కు చెందిన ధనవంతులు సముద్ర తీరంలో సేదతీరేందుకు తహతహలాడిపోయేవారు.

20వ శతాబ్ధంలో ఈ దిశగా జనం ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సముద్రతీరప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకులు సముద్రతీర ప్రాంతాల్లో నివసించే 15 వేల జనాభా ఆరోగ్యంపై సర్వేచేశారు. దీనిని క్రోడీకరించి సముద్రతీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని తేల్చిచెప్పారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)