Breaking News

అమెరికా యుద్ధనౌకపై హూతీల దాడి: పెంటగాన్‌

Published on Wed, 11/13/2024 - 08:47

న్యూయార్క్‌: తమ యుద్ధనౌకపై యెమెన్ హుతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబ్ అల్-మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో రెండు అమెరికా డిస్ట్రాయర్లు లక్ష్యంగా హుతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని పెంటగాన్ పేర్కొంది. అయితే.. హైతీ రెబల్స్‌ ప్రయోగించిన డ్రోనన్లు, క్షిపణులను యుద్ధనౌకలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పి కొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక.. ఈ ఘటనలో యుద్ధనౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.

‘‘అమెరికా యుద్ధనౌకలపై ఐదు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణులతో హౌతీ రెబల్స్‌  దాడికి పాల్పడ్డారు. అయితే.. వాటిని యుద్ధనౌకలోని సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. యుద్ధనౌకలు దెబ్బతినలేదు. అందులోని సిబ్బంది కూడా ఎవరూ గాయపడలేదు. మరోవైపు.. అమెరికా అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌పై కూడా దాడి చేశామని హుతీలు చేసిన వాదన సరైనది కాదు. మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా.. హుతీ తిరుగుబాటుదారుల దాడి జరగలేదు’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.

నవంబర్ 2023లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌లో హుతీ రెబల్స్‌ పలు నౌకలపై దాడి చేయడం మొదలుపెట్టారు. గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం చేస్తున్న దాడులకు త్యరేకంగా హౌతీ తిరుగుబాటుదాడులు ఇజ్రాయెల్‌, వాటి మిత్ర దేశాలపై నౌకలపై  దాడులకు దిగుతున్న విషయం తెలిసింది. ఇక.. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాజాలో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా.. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్‌లలో ఇరాన్ మద్దతుగల గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయి.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు