Breaking News

Drone Attack: అమెరికా సంచలన ప్రకటన

Published on Sun, 12/24/2023 - 07:21

వాషింగ్టన్‌: గుజరాత్‌లోని పోర్‌బందర్‌ సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్‌ దాడి సంచలనం రేపిన విషయం తెలిసిందే.‌ అయితే ఈ దాడికి కారణమైన డ్రోన్‌ ఇరాన్‌ నుంచి ప్రయోగించారని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్‌ తెలిపింది. ఈ మేరకు పెంటగాన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘జపాన్‌కు చెందిన కెమికల్‌ ట్యాంకర్‌ నౌక కెమ్‌ ప్లూటో మంగళూరు వెళుతోంది. ఈ నౌకపై భారత తీరానికి 200 నాటికల్‌ మైళ్ల దూరంలో డ్రోన్‌ దాడి జరిగింది. డ్రోన్‌ దాడితో చెలరేగిన మంటలను నౌకలోని సిబ్బంది ఆర్పివేశారు. నౌకపై దాడి చేసిన డ్రోన్‌ను ఇరాన్‌ నుంచి ప్రయోగించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడి చేయడం 2021 నుంచి ఇది ఏడోసారి’అని పెంటగాన్‌ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిపై ఇరాన్‌ ఇంత వరకు స్పందించలేదు. 

ఓ పక్క ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హతీ రెబెల్స్‌ దాడి చేస్తుండగా భారత సమీపంలో నౌకపై ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే డ్రోన్‌ దాడి తామే చేశామని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. డ్రోన్‌ దాడికి గురైన కెమ్‌ప్లూటోకు భారత కోస్ట్‌గార్డ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తోంది.  

ఇదీచదవండి..హిందూ ఆలయంపై విద్వేష రాతలు    

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)