Breaking News

...పెంగ్విన్‌  ఒంటరి నడక

Published on Sun, 01/25/2026 - 04:19

అది అంతులేని మంచు ఎడారి. ఎటు చూసినా గడ్డకట్టే చలి.. ప్రాణవాయువు కూడా భారమయ్యే శూన్యం. అక్కడ వందలాది పెంగ్విన్లు గుంపులు గుంపులుగా ఆహారం కోసం సముద్రం వైపు పరుగులు తీస్తున్నాయి. కానీ, ఒక్క పెంగ్విన్‌ మాత్రం వెనక్కి తిరిగింది. అందరూ వెళ్తున్న బాటను వదిలేసింది. చావు ఎదురొస్తుందని తెలిసినా.. మంచు కొండల వైపు ఒంటరిగా అడుగులు వేస్తోంది.

ఏమిటీ ’నిహిలిస్ట్‌ పెంగ్విన్‌’ మిస్టరీ?  
ఇటీవల టిక్‌టాక్, ఇన్‌స్టా్రగామ్‌లో ఈ వీడియో ప్రత్యక్షమవ్వగానే.. నెటిజన్లు దీనికి ‘నిహిలిస్ట్‌ పెంగ్విన్‌’అని పేరు పెట్టారు. ‘నిహిలిజం’అంటే ‘ఈ ప్రపంచంలో దేనికీ అర్థం లేదు, ఏ విలువలకు ప్రాధాన్యం లేదు’అనే ఒక తాతి్వక చింతన. ‘నేను ఎక్కడికి వెళ్లినా చివరికి మిగిలేది శూన్యమే కదా’.. అనే భావనలో ఉన్నవారు, ఆ పెంగ్విన్‌ ప్రయాణంలో తమను దర్శించుకుంటున్నారు. ‘నేను కూడా ఈ పెంగ్విన్‌ లాగే ఉన్నాను.. అందరిలా పరుగెత్తలేక ఎటో తెలియని ప్రయాణం చేస్తున్నాను’.. అంటూ లక్షలాది మంది నెటిజన్లు తమ భావోద్వేగాలను దీనికి ముడిపెడుతున్నారు.

అది ‘మృత్యుయాత్ర’
ప్రఖ్యాత దర్శకుడు వెర్నర్‌ హెర్జోగ్‌ 2007 అంటార్కిటికాలో తన డాక్యుమెంటరీ కోసం చిత్రీకరించిన ఈ దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో కన్నీళ్లు పెట్టిస్తోంది. సముద్రం వైపు వెళ్తేనే దానికి ఆహారం దొరుకుతుంది, ప్రాణం నిలుస్తుంది. కానీ, ఆ పెంగ్విన్‌ తన గమ్యాన్ని మార్చుకుంది. ఎవరూ లేని, ఏమీ దొరకని నిర్జన పర్వతాల వైపు అది సాగిస్తున్న ప్రయాణాన్ని దర్శకుడు ‘మృత్యు యాత్ర’అని పిలిచాడు. ఎందుకంటే, ఆ దారిలో దానికి ఎదురయ్యేది కేవలం మరణం మాత్రమే.  

గుండె బరువెక్కుతోంది 
జనవరి 16న ఒక టిక్‌టాక్‌ యూజర్‌ ఈ వీడియోను ఎడిట్‌ చేసి ‘లామోర్‌ టూజూర్‌’అనే పాటను జత చేయడంతో అది విశ్వవ్యాప్తంగా కదిలిస్తోంది. ఇది ఒక ఫ్రెంచ్‌ పేరు. తెలుగులో దీని అర్థం ‘శాశ్వతమైన ప్రేమ’లేదా ‘ఎప్పటికీ నిలిచి ఉండే ప్రేమ’. ఆ గంభీరమైన సంగీతం, పెంగ్విన్‌ వేస్తున్న ఆ నిశ్శబ్ద అడుగులు చూస్తుంటే గుండె బరువెక్కక మానదు. చివరికి ఆ పెంగ్విన్‌ ఏమౌతుందో అందరికీ తెలుసు. అది తిరిగి రాదు. కానీ, ఆ ప్రయాణం మనిషికి ఒక నిశ్శబ్ద సత్యాన్ని బోధిస్తోంది. బతుకు పోరాటంలో అలిసిపోయిన ఆత్మలకు ఆ పెంగ్విన్‌ ఒక మూగ సాక్ష్యం. ఇది కేవలం ఒక పక్షి నడక కాదు.. ప్రతి మనిషి లోపల దాగి ఉన్న ఒక నిశ్శబ్ద ఆవేదన.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)